పోలి పాడ్యమి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును అంటే కార్తీక అమావాస్య 2025 తర్వాత రోజును పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి అంటారు.

పోలి పాడ్యమి కార్తీక మాసంలో వచ్చే చివరి రోజును అంటే కార్తీక అమావాస్య 2025 తర్వాత రోజును పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి అంటారు. ఈ రోజు మహిళలు తెల్లవారుజామున చెరువులు, నదులు, కోనేటిలో దీపాలు వదులుతారు. దీపదానం చేస్తారు. సాధారణంగా ఈ పోలి పాడ్యమి రోజు 30 ఒత్తులతో దీపాలు వెలిగిస్తారు. ముఖ్యంగా అరటి దొప్పలలో దీపాలు వెలిగించి నీటిలో వదులుతారు. అనంతరం మూడు సార్లు నీటిని చేతులతో తోస్తూ నమస్కరించుకుని పోలి స్వర్గం కథ వింటారు. ఈ నేపథ్యంలో పోలి పాడ్యమి 2025 తేదీ..
పోలి పాడ్యమి రోజున ఉదయాన్నే తలస్నానం చేసి, 30 వత్తుల దీపం వెలిగించాలి. దాన్ని అరటి దొప్పలలో పెట్టి పారే నీటిలో వదలాలి. తద్వారా కార్తీక మాస దీపారాధన పుణ్యం లభిస్తుందని నమ్మకం. ఆ తర్వాత శివాలయానికి వెళ్లి, శివ లింగానికి అభిషేకం చేసి ‘ఓం నమశ్శివాయ’ అనే మంత్రాన్ని జపించాలి. సాయంత్రం తులసి కోట వద్ద దీపాలు వెలిగించి, పోలి స్వర్గం కథ విని, దీపదానం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు.


