ఇంట్లో పూజ ఇంటి యజమాని ఎందుకు చేయాలంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతడు పూజ చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం అందరికీ దక్కుతుంది.

ఇంట్లో పూజ ఇంటి యజమాని ఎందుకు చేయాలంటే ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో అతడు పూజ చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం అందరికీ దక్కుతుంది. ఎలాగైతే ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఒక ప్రధానమైనటువంటి వ్యక్తి తాను ఒక్కడు సంపాదిస్తే ఇంట్లో అందరూ ఎలాగైతే తిని కూర్చుంటున్నారో, అలాగే ఇంట్లో ఇంటి యజమాని పూజ చేయడం వల్ల ఇంటి శుభక్షం జరుగుతుంది. అలాగని ఆడవాళ్ళు చేయకూడదు అనేటటువంటి ఉద్దేశం కాదు, ఆడవాళ్ళు పూజ చేసుకోవచ్చు కానీ, ఇప్పుడు ఆడవాళ్లే ప్రత్యేకంగా మగవాళ్ళు లేకపోయినా ఆడవాళ్లే ప్రత్యేకంగా చేసుకునేటటువంటి నోములు, వ్రతాలు, యజ్ఞాలు చాలా మటుకు ఉన్నాయి. అందులో మగవాడి ప్రమేయం అవసరం లేదు, అలాగే ఇంటిలో పూజ చేసుకునేటటువంటి విధానంలో కూడా ఇంటి యజమాని ఒక్కడు చేయడం వల్ల అందులో భార్యకు పుణ్యం వస్తుంది. తన కడుపున పుట్టిన బిడ్డలకు పుణ్యం వస్తుంది. అలాగే ఇంట్లో ఉన్నటువంటి ప్రతి వ్యక్తులకు పుణ్యం వస్తుంది. తల్లిదండ్రులకి కూడా 100% వస్తుంది. అదే ఆడవాళ్ళు పూజ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఆ పూజా ఫలితం కేవలం ఆడవాళ్ళకు మాత్రమే పరిమితి అయిపోతుంది.

ఇప్పుడు చాలా మటుకు భర్త దాంట్లో సగభాగం భార్య అని చెప్తూ ఉంటూ ఉంటారు. కానీ భార్య దాంట్లో భర్త సగభాగం అని ఎవరు చెప్పరు కదా, అలాగే పూజా ఫలితం అనేటటువంటి ఇంటి యజమాని అంటే, మగవారు ఎందుకు చేయాలి అని అంటే గనక, మగవాడు చేయడం వల్ల పుణ్య ఫలితం రెట్టింపు అవుతుంది. ఆడవాళ్ళు చేయడం వల్ల ఆ పుణ్య ఫలితం కేవలం ఆ స్త్రీకి మాత్రమే దక్కుతుంది అనే ఒక విధానంతో మాత్రమే ఆడవాళ్ళకు చేయొద్దు అన్నారు తప్ప, చేస్తే ఏదో పాపం అనేటటువంటిది కాదు. అంటే పాపం అలా కాదు, ఉదయము లేవగానే ఒక మహిళ యొక్క దినచర్య ఎలా ఉంటుందంటే లేవగానే ముందు స్నానం చేసేస్తారు, వెంటనే దేవుడికి దీపం పెట్టుకుంటారు, ఆ తర్వాత వంటగదిలో వెళుతూ ఉంటారు, ఇక్కడ ఆడవాళ్ళకు ఉదయం లేవగానే చెప్పినటువంటి మాట పూజ చేసుకోవాలి, అంటే తులసి కోటకు పూజ చేసుకోవాలి, అనేటటువంటి నియమము తులసికోట మీరు ఎప్పుడైనా గమనించండి, ఆడవాళ్ళు ఎప్పుడూ కూడా తులసి కోటకు మాత్రమే పూజ చేస్తారు, మగవాడు ఇంట్లో ఉన్నటువంటి దేవతలను పూజించడం అనేటటువంటి ధర్మంగా కనిపిస్తూ ఉంటుంది. పూర్వకాలం నుంచి కూడా అదే పద్ధతి ఉంది, ఇప్పుడు పద్ధతులు మార్చేసారు, పూజ గదిలో దీపం పెడతారు, కదా మగవాడే పెట్టాలి అని అంటున్నాను గా, మగవాడు మాత్రమే ఇంట్లో పూజా గదిలోకి వెళ్లేటటువంటి విధానము కేవలం ఇంటి యజమానికి మాత్రమే ఉంటుంది. ఆడ ఆడవాళ్లకు ఉన్నటువంటి నియమం ఏంటి ,పొద్దున లేవగానే తప్పకుండా తులసికోట దగ్గర పూజ చేసుకొని, దీపం పెట్టడం మొట్టమొదటి కర్తవ్యం, ఆ తర్వాత ఇంటి పనులు చేసుకొని భర్తకు పూజకు అవసరమైనటువంటి వస్తువులు, పూలు ఉంటాయి, లేదంటే దీపారాధన చేయవలసినటువంటి వస్తువులు ఉంటాయి, ఇలా కొన్ని అవి సమకూర్చడం అంటే భర్త చేసేటటువంటి పనుల్లో భార్య చేసేటటువంటి ఏదైతే పనులు ఉంటాయో, ఆ విధానమే పూజ అంటారు. ఆ పూజ చేసినా కూడా నువ్వు పూజ చేసినంత పుణ్య ఫలితం ఆడవాళ్ళకి దక్కుతుంది. అందుకే ఇంటి యజమాని పూర్తి చేస్తే ఫలితం అందరికీ దక్కుతుంది. పూర్తి ప్రసంగం ఈ కింది వీడియోలో..!

Updated On
ehatv

ehatv

Next Story