2026లో దేశంలో మొదటి చంద్రగ్రహణం.. ఆరోజు ఏమేమి నియమాలు పాటించాలంటే..!

హిందూ సంప్రదాయాలలో చంద్ర గ్రహణం (Lunar eclipse) ఆధ్యాత్మికంగా గడిపేందుకు శక్తివంతమైన సమయం అని చెబుతారు. చాలా మంది భక్తులు గ్రహణ సమయాన్ని మంత్రాలు జపిస్తూ, ధ్యానం చేస్తూ గడుపుతారు, ఆ తర్వాత వారు తరచుగా చంద్రుడికి ప్రార్థనలు చేస్తారు, చంద్రుడు నెగెటివ్ ఎనర్జీని తొలగించి పాజిటివ్ వైబ్రేషన్ ఇస్తాడని నమ్ముతారు. అయితే ఈ ఏడాది భారత్ దేశంలో మొదటి చంద్రగ్రహణం ఎప్పుడు ఏర్పడనుందో తెలుసుకుందాం. 2026లో మొత్తం నాలుగు గ్రహణాలు ఉంటాయి, కానీ భారతదేశంలో ఒకే చంద్ర గ్రహణం కనిపిస్తుంది, దీని వలన ఈ చంద్ర గ్రహణం చాలా ముఖ్యమైనది. 2026లో మొదటి చంద్ర గ్రహణం మంగళవారం, మార్చి 3, 2026న సంభవిస్తుంది. ఆరోజు చంద్ర గ్రహణం 2026 సమయాలు ఉదయం 9:39, ముగింపు: సాయంత్రం 6:46
సూతక్ సమయంలో అనుసరించాల్సిన నియమాలు, పద్ధతులు, చాలా కుటుంబాలు ఈ సాంప్రదాయ నియమాలను పాటిస్తాయి. వంట చేయడం, ఆహారం తినడం చేయకూడదు. దేవాలయాలను మూసివేస్తారు. శుభ కార్యక్రమాలు, వేడుకలను వాయిదా వేసుకోవాలి. శారీరక, మానసిక స్వచ్ఛతను కాపాడుకోండి. ప్రార్థనలు, జపాలు మరియు ధ్యానంపై దృష్టి పెట్టాలి. ప్రాంతం, కుటుంబ సంప్రదాయాన్ని బట్టి ఆచారాలు మారుతుంటాయి. ముఖ్యంగా ప్రజలు వారి నమ్మకాలకు అనుగుణంగా ఉండే వాటిని అనుసరించచాలిని పండితులు చెప్తున్నారు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు మరియు అనారోగ్యంతో ఉన్నవారికి, ఈ నియమాలు పాటించాల్సిన అవసరంలేదని చెప్తున్నారు.


