Shani Trayodashi: రేపే శని త్రయోదశి + శనివారం... పూజా విధానం..!

హిందూ సంప్రదాయంలో అత్యంత ప్రాముఖ్యత కలిగిన పర్వదినాల్లో శని త్రయోదశికి ఒకటి. శనివారం రోజున వచ్చే త్రయోదశి తిథినే శని త్రయోదశి అంటారు. ఈ తిథి పరమేశ్వరుడు, శనీశ్వరుడికి అంకితం చేయబడినదిగా పండితులు చెబుతున్నారు. శనీశ్వరుడిని న్యాయ దేవుడిగా భావించి, ఆయన అనుగ్రహం కోసం ఈ రోజున ఉపవాసం ఆచరించి పూజలు చేస్తారు.

శని త్రయోదశి రోజున శని దేవుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే ఆయుష్షు, ఆరోగ్యం, సంపదలు లభిస్తాయని నమ్మకం. ముఖ్యంగా జాతకంలో శని దోషం, ఏలినాటి శని, అష్టమ శని ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి ఈ రోజు చేసే పూజలు ఉపశమనం కలిగిస్తాయని నమ్మకం.

శని త్రయోదశి జనవరి 2026 తిథి వివరాలు

2026 సంవత్సరంలో తొలి శని త్రయోదశి జనవరి 30వ తేదీ శుక్రవారం ఉదయం 11:09 గంటలకు ప్రారంభమై, జనవరి 31వ తేదీ శనివారం ఉదయం 8:26 గంటలకు ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారం జనవరి 31, శనివారం రోజున శని త్రయోదశిని ఆచరించాలి. ప్రాంతాలు, పంచాంగాల ప్రకారం స్వల్ప తేడాలు ఉండవచ్చని పండితులు సూచిస్తున్నారు.

శనివారం శ్రీమహావిష్ణువుకు, త్రయోదశి తిథి పరమేశ్వరునికి ప్రీతిపాత్రమైనది. అంతేకాకుండా శని దేవుడు త్రయోదశి తిథినే జన్మించాడనే పురాణ విశ్వాసం ఉంది. అందుకే శని త్రయోదశికి అంతటి విశిష్టత ఏర్పడింది. శని వాహనం కాకి.. కావున కాకికి ఆహారాన్ని పెడితే చాలా మంచిదని పూజారులు చెబుతున్నారు. నల్ల చీమలు తిరిగే ప్రదేశంలో పంచదారను చల్లండి. ఆ తరువాత రావి చెట్టు దగ్గర దీపారాధన చేస్తే ఎంతో ప్రయోజనం ఉంటుంది. శని భగవానుడి భార్య జ్యేష్టాదేవి.. రావి చెట్టు మొదట్లో నివసిస్తుంది. శని త్రయోదశి రోజున రావి చెట్టుకు 11 ప్రదక్షిణలు.. శని దోషం తొలగిపోతుంది

దేవాలయానికి వెళ్లి శనికి తైలాభిషేకం అవి చేస్తారు, నవగ్రహాల్లో శనేశ్వరుడికి ఇట్లా అభిషేకం చేస్తారు. తైలాభిషేకం చేస్తారు చిన్నటి నల్ల గుడ్డల్లో నువ్వులు పోసి మూట కట్టి దాన్నే దీపంగా వెలిగిస్తారు, ''నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తంనమామి శనేశ్చరం'' ఈ చిన్న శ్లోకాన్ని చదువుకుంటూ దేవాలయంలో ప్రదక్షణ చేసుకోవచ్చు.

Updated On
ehatv

ehatv

Next Story