తిరుమలలో ప్రత్యేక ద్రర్శనాలు రద్దు

తిరుమల శ్రీవారి నవాహ్నిక బ్రహ్మోత్సవాల సందర్భంగా పలు శ్రీవారి ఆర్జిత సేవలు, బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను అక్టోబరు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు టిటిడి రద్దు చేసింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో స్వామివారి వాహనసేవలు వీక్షించేందుకు సామాన్య భక్తులు సాధారణం కంటే అధికంగా విచ్చేస్తారు. కావున వారికి సంతృప్తికరంగా దర్శనం కల్పించేందుకు బ్రహ్మోత్సవాలలో బ్రేక్‌ దర్శనాలు, వివిధ ప్రత్యేక దర్శనాలను(Special darshanam) టిటిడి(TTD) రద్దు చేసింది. ఇందులో భాగంగా అక్టోబరు 3వ తేదీ (అంకురార్పణం) నుంచి 12వ తేదీ (చక్రస్నానం) వరకు ప్రతి రోజు వయో వృద్దులు, దివ్యాంగులు, సంవత్సరం లోపు చిన్న పిల్లల తల్లిదండ్రులకు దర్శనాలను రద్దు చేసింది. విఐపి బ్రేక్‌ దర్శనాలను(VIP break Darshanam) ప్రోటోకాల్‌ ప్రముఖులకు మాత్రమే టిటిడి పరిమితం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించి టిటిడికి సహకరించాలని కోరుతున్నది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story