TTD has a rare offer for the youth, if you write one crore names, you will get immediate break darshan along with your family..!!

యువతలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని, సనాతన ధర్మంపై అనురక్తిని కల్పించడమే లక్ష్యంగా టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే రామకోటి తరహాలో గోవింద కోటిని ప్రవేశపెట్టింది. గోవింద కోటి రాసిన యువతకు వీఐపీ దర్శనాన్ని కల్పిస్తోంది. 25 సంవత్సరాలు, లేదా అంతకంటే తక్కువ వయసున్న వారు ఇందుకు అర్హులు. 10,01,116 సార్లు రాస్తే రాసిన వారికి వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు. కోటిసార్లు నామాలు రాస్తే వారితోపాటు కుటుంబ సభ్యులందరూ వీఐపీ బ్రేక్ దర్శనం చేసుకోవచ్చు. తితిదే సమాచార కేంద్రాలు, పుస్తక విక్రయ కేంద్రాలు, ఆన్‌లైన్‌లో గోవిందకోటి నామాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. 200 పేజీలుండే పుస్తకంలో 39,600 నామాలు రాయొచ్చు. 10,01,116 నామాలు పూర్తి చేయడానికి దాదాపు 26 పుస్తకాలు అవసరం అవుతాయని టీటీడీ అధికారులు చెబుతున్నారు. కోటి నామాల పుస్తకాలను రాయడానికి కనీసం మూడేళ్ల సమయం పడుతుందని టిటిడి సిబ్బంది చెబుతున్నారు. గోవిందకోటి నామాల పుస్తకాన్ని పూర్తిచేసి తిరుమలలోని తితిదే పేష్కార్ ఆఫీసులో అందిస్తే వారికి మరుసటి రోజు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తారు.


