వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ.

వైకుంఠ ఏకాదశి హిందువులకు అత్యంత పవిత్రమైన పండుగ. ఇది ధనుర్మాసంలో (మార్గశిర మాసం) వచ్చే ఏకాదశి. ఈ రోజున విష్ణుభగవానుడు భక్తులకు మోక్షద్వారం (వైకుంఠ ద్వారం) తెరుస్తాడని నమ్మకం. అనేక ఆలయాల్లో ప్రత్యేక ద్వారం తెరిచి భక్తులకు దర్శనం ఇస్తారు. దీనివల్ల మోక్షప్రాప్తి కలుగుతుందని విశ్వాసం. ఉపవాసం, జపం, భజన, విష్ణు సహస్రనామ పారాయణం చేయడం శుభప్రదం. ఈ రోజున మురాసురుని సంహరించి, ఏకాదశి దేవిని విష్ణువు వరంగా అనుగ్రహించాడని పురాణ కథ. ఈ రోజు ఉపవాసం చేసి విష్ణు పూజ చేస్తే పాపాలు నశించి, సద్గతులు లభిస్తాయని నమ్మకం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఘనంగా జరుగుతుంది.

2025 ధనుర్మాసం వేళ ఆధ్యాత్మిక వైభవాన్ని రెట్టింపు చేసే పర్వదినం ఈ ముక్కోటి ఏకాదశి. శ్రీమహావిష్ణువు దర్శనం కోసం ముక్కోటి దేవతలు వేచి చూసే పవిత్రదినం. ముఖ్యంగా ఉత్తర ద్వారం నుంచి ఆ పురుషోత్తముణ్ని దర్శించుకునే పుణ్యదినం. సంవత్సరానికి 12 నెలలు. నెలకు రెండు ఏకాదశులు అంటే మొత్తం 24 ఏకాదశులు ఉంటాయి. కానీ వేటి విశిష్టత వాటిదే! కానీ ఈ 24 ఏకాదశుల్లో అత్యంత ప్రత్యేకమైనది, విశిష్టమైనది మాత్రం ముక్కోటి ఏకాదశి. దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా పిలుస్తారు.

ముక్కోటి దేవతలు శ్రీమహావిష్ణువును స్తుతించి.. ఆయన అనుగ్రహం పొందిన రోజు కావడంతో దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందని శాస్త్రవచనం. సాధారణంగా ఏకాదశి పర్వదినాన్ని చాంద్రమానం ఆధారంగా జరుపుకుంటారు. కానీ ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిని మాత్రం సౌరమానం ఆధారంగా జరపుకోవడం విశేషం.. సూర్యభగవానుడు ధనుస్సు రాశిలో సంచరించే కాలాన్ని ధనుర్మాసం అంటారు. ఈ పవిత్రమైన ధనుర్మాసంలో వచ్చే శుక్ల ఏకాదశిని ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశిగా జరుపుకోవడం సంప్రదాయం. సాధారణంగా దేవతలకు ఉత్తరాయణం పగటి సమయంగానూ.. దక్షిణాయనం రాత్రి సమయంగా పేర్కొంటారు. అయితే ఉత్తరాయణం - దక్షిణాయనాలకు సంధి కాలంలో వచ్చే ధనుర్మాసం దేవతలకు బ్రాహ్మీ సమయంగా పండితులు అభివర్ణిస్తారు. అదే సమయంలో అంటే ఈ బ్రాహ్మీ ముహూర్తంలో వచ్చే శుక్ల ఏకాదశిని అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు. అదే వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి.

ఈ ఏకాదశి రోజు దేవతలంతా వైకుంఠానికి వెళ్లి ఉత్తర ద్వారం నుంచి ఆ వైకుంఠనాథుడిని దర్శనం చేసుకుంటారట. అదే సంప్రదాయం ప్రకారం శ్రీమహావిష్ణువు అనుగ్రహం పొందడం కోసం వైష్ణవ ఆలయాల్లో.. వైకుంఠంతో సమానమైన రత్న మందిరాన్ని నిర్మించి.. ఉత్తర దిక్కుగా స్వామి వారిని దర్శించి తరిస్తారు. దీనిని ఉత్తర ద్వార దర్శనం అంటారు. ఈ ఉత్తర ద్వార దర్శనం కోసం లక్షలాది మంది భక్తులు వేచి ఉంటారు. మోక్ష ద్వారంగా చెప్పే ఉత్తర ద్వారం ద్వారా స్వామి వారిని దర్శించుకుంటే చాలు తమ జన్మ పునీతమవుతుందని భావిస్తారు.

వైకుంఠ ఏకాదశి పూజా విధానం

బ్రహ్మముహూర్తంలో ఉదయం తొందరగా లేచి స్నానం చేయాలి. శుభ్రమైన తెల్ల లేదా పసుపు వస్త్రాలు ధరించాలి. మనసు ప్రశాంతంగా ఉంచాలి

ఇంట్లో పూజా గది శుభ్రం చేయాలి. శ్రీ మహావిష్ణు / వెంకటేశ్వర స్వామి ఫోటో లేదా విగ్రహం పెట్టాలి. దీపం వెలిగించాలి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం, వైకుంఠ ఏకాదశి వ్రతం కరిష్యే. స్వామికి గంధం, కుంకుమ, తులసి దళాలు సమర్పించాలి. పుష్పాలతో పూజ చేయాలి. పండ్లు, పాలు నైవేద్యంగా పెట్టాలి. తులసి కలిపిన నీళ్లు. ఏకాదశి కాబట్టి అన్నం పెట్టకూడదు. ఓం నమో నారాయణాయ (108 సార్లు) లేదా

విష్ణు సహస్రనామం, వెంకటేశ్వర సుప్రభాతం, వైకుంఠ ద్వార ధ్యానం, వైకుంఠ ద్వారం తెరుచుకున్నట్లు ధ్యానం చేయాలి. స్వామి పాదాల దగ్గర మనసు నిలిపితే చాలా శుభం. పూర్తిగా ఉపవాసం లేదా పండ్లు, పాలు, నీళ్లు మాత్రమే తీసుకోవచ్చు. అబద్ధం, కోపం, చెడు ఆలోచనలు దూరంగా పెట్టాలి. మరుసటి రోజు (ద్వాదశి) పారాణం చేసి వ్రతం ముగించాలి. బ్రాహ్మణులకు లేదా పేదలకు అన్నదానం చేస్తే ఉత్తమం. ఈ విధంగా పూజ చేస్తే పాపక్షయం, మనశ్శాంతి, మోక్ష ప్రాప్తి ఆశీర్వాదం లభిస్తాయని నమ్మకం.

Updated On
ehatv

ehatv

Next Story