తమిళనాడు(Tamil Nadu)లోని అమ్మాపెట్టై( Ammapettai) గ్రామంలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది.

తమిళనాడు(Tamil Nadu)లోని అమ్మాపెట్టై( Ammapettai) గ్రామంలో ఉన్న ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడింది. ఇక్కడ శివుడిని వెన్ని కరుంబేశ్వర స్వామి (Venni Karumbeswarar swamy)అని పిలుస్తారు, అమ్మవారు సౌందర్యనాయకి. ఈ ఆలయం షుగర్ (Diabetes) తగ్గించే అద్భుత శక్తి కలిగి ఉందని భక్తుల నమ్మకం. ఇది ఎలా జరుగుతుందో ఇంకా కొంచెం లోతుగా చూద్దాం, భక్తులు గోధుమ రవ్వ, చక్కెర లేదా బెల్లంతో చేసిన ప్రత్యేక ప్రసాదాన్ని స్వామివారికి సమర్పిస్తారు. దీన్ని "కరుంబు పొంగల్" అని కూడా అంటారు. ఈ ప్రసాదాన్ని ఆలయంలోని ఒక ప్రత్యేక ప్రాంతంలో ఉంచుతారు. అక్కడ చీమలు వచ్చి ఆ ప్రసాదాన్ని తింటాయి. నమ్మకం ప్రకారం, చీమలు ఈ ప్రసాదాన్ని తినడం వల్ల భక్తుడి శరీరంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయని భక్తుల నమ్మకం. భక్తులు స్వామివారిని పూజించి, తమ ఆరోగ్యం కోసం ప్రార్థనలు చేస్తారు. కొందరు నిర్దిష్ట రోజుల పాటు11 లేదా 21 రోజులు ఆలయాన్ని సందర్శిస్తారు. స్థానికులు, భక్తులు చెప్పే కథనం ప్రకారం, ఈ ఆలయంలో శివుడు భక్తుల రోగాలను తొలగించే శక్తిని కలిగి ఉన్నాడు. ముఖ్యంగా మధుమేహం ఉన్నవారు ఇక్కడికి వచ్చిన తర్వాత వారి షుగర్ లెవెల్స్ తగ్గినట్లు అనేక అనుభవాలు ఉన్నాయి. కొందరు వైద్యులు కూడా ఈ ఆలయంలో జరిగే ఈ వింత ఘటనను పరిశీలించి, షుగర్ స్థాయిలు తగ్గడం వెనుక ఏదో ఆధ్యాత్మిక లేదా శాస్త్రీయ కారణం ఉండొచ్చని ఆశ్చర్యపోయారు. అయితే దీనిపై సమగ్ర శాస్త్రీయ అధ్యయనాలు లేవు. ప్రత్యేక పండుగలు శివరాత్రి, నవరాత్రి సమయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది.
