ఆంధ్రప్రదేశ్‌లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్య దేవాలయంలో (Arasavalli Temple) సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం అరసవల్లి సూర్య దేవాలయంలో (Arasavalli Temple) సూర్యనారాయణ స్వామి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకాయి. పంచద్వారాలను దాటి గాలిగోపురం మధ్య నుంచి వచ్చిన లేలేత కిరణాలు ఆదిత్యుని తాకిన దృశ్యం అద్భుతం! అది చూసి భక్తులు తన్మయత్వం చెందారు.

మంగళవారం ఉదయం 6.05 గంటలకు కొన్ని నిమిషాలపాటు అ అద్భుతం గోచరించింది. ఈ అరుదైన ఘటనను చూసేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. బుధవారం కూడా స్వామివారి మూలవిరాట్‌ను సూర్యకిరణాలు తాకే అవకాశం ఉందని పండితులు చెప్పారు. ఏటా రెండు సార్లు ఇలాంటి అద్భుతం ఆవిష్కృతమవుతుంది. ప్రతి సంవత్సరం మార్చి 9, 10 తేదీల్లో.. అలాగే అక్టోబర్ నెల 1, 2 తేదీల్లో భక్తులకు కనువిందు చేస్తుంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story