వినాయకచవితి నవరాత్రులు(Vinaya chaturthi) ముగిసాయి.

వినాయకచవితి నవరాత్రులు(Vinaya chaturthi) ముగిసాయి. వినాయక నిమర్జనం కూడా అయిపోయింది. ఇప్పుడు శరన్నవరాత్రులు(Navratri) మొదలు కాబోతున్నాయి. దుర్గాదేవి(Durgadevi) మండపాలు వెలుస్తున్నాయి. కోల్‌కతా(Kolkata) నగరంలో శిల్పులందరూ దుర్గాదేవి విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. దుర్గమ్మ విగ్రహాల తయారీలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. అమ్మవారి విగ్రహాలు రూపొందించేటప్పుడు నాలుగు విషయాలను పరిగణనలోకి తీసుకుంటారు. విగ్రహాల తయారీకి గంగానది ఒడ్డున ఉన్న మట్టి, గోవు పేడ, గో మూత్రంతో పాటు వేశ్యల ఇంటిలోని(Sex worker) మట్టిని ఉపయోగిస్తారు శిల్పులు. ఇది అనాదిగా వస్తున్న సంప్రదాయం. వేశ్యల ఇంటి నుంచి తెచ్చే మట్టిని పుణ్యమట్టిగా(Punya mati) పిలుస్తారు. నిషిద్దో పల్లీస్‌ అని కూడా అంటారు. ఈ నాలుగింటిలో ఏది లేకపోయినా విగ్రహం తయారు చేయరు. వేశ గృహల ప్రాంగణంలోకి మట్టిని తీసుకురావడానికి శిల్పులే వెళతారు. తమకు మట్టి కావాలని వేశ్యలను ప్రాధేయపడతారు. వారిని గౌరవ మర్యాదాలతో అభ్యర్థిస్తారు. బెంగాలీ శిల్పకారులు ఇప్పటికీ ఈ ఆనవాయితీని పాటిస్తున్నారు. ఈ సంప్రదాయం ఎప్పుడు మొదలయ్యిందో, ఎందుకు మొదలయ్యిందో తెలియదు. వేశ్యల ఇంట్లోంచి తెచ్చిన మట్టితో దుర్గమ్మ విగ్రహం తయారు చేస్తే అందులోకి అమ్మవారి కళ వస్తుందన్నది ఓ నమ్మకం. ఆ అమ్మవారి దృష్టిలో అందరూ సమానమేనని, ఎవరినీ కించపరచకూడదని, హేయభావంతో చూడకూడదనే సందేశం కూడా ఇందులో ఉంది.

Updated On
Eha Tv

Eha Tv

Next Story