C-section before February 13th: ఈ ఫిబ్రవరిలో పుట్టే పిల్లలకు పితృదోషాలు వెంటాడుతాయా..! సి-సెక్షన్‌ ఫిబ్రవరి 13లోపే..!

ఫిబ్రవరి మాసంలో ఉండేటువంటి గ్రహ స్థితిని గనక మనం ఒక్కసారి గమనిస్తే, మిధున రాశి యందు గురుడు సంచరిస్తూ ఉన్నారు. అలాగే సింహ రాశి యందు కేతువు సంక్రమణం జరుగుతూ ఉన్నది. కేతువు సంచరిస్తూ ఉన్నారు. అలాగే కుంభ రాశి యందు రాహువు ఉన్నారు. మీన రాశి యందు శనేశ్చరుడు. ఈ నాలుగు గ్రహాలు అలా స్థానంలో ఉన్నాయి. అయితే 13వ తారీకు వరకు రవి సంచారము మకర రాశి యందు ఉంటుంది. 13వ తారీకు తదుపరి రవి సంచారము కుంభ రాశిలోకి వెళ్తుంది. ఒక్క విషయాన్ని మనం పరిశీలన చేస్తే, కుంభ రాశిలో ఇప్పటికే రాహువు యొక్క సంచారం ఉన్నది. ఈ 13వ తారీకు దాటాక రవి కూడా కుంభ రాశిలోకి ప్రవేశం చేయబోతూ ఉన్నారు. రవి రాహువులు కలిసి ఉండడం వల్ల అది పితృ దోష కారకంగా మనం చెప్పుకోవచ్చు. జనరల్‌గా అయితే రవి రాహువు కలిసినప్పుడు, సూర్య గ్రహణాదులు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఈసారి మన భారతదేశంలో ఏ గ్రహణాలు కూడా ఇప్పుడు కనబడడం లేదు కాబట్టి, గ్రహణ సంబంధమైన విషయాలపై మనం భయపడవలసినటువంటి అవసరం లేదు, కానీ ఇక్కడ రవి, రాహువులు కలిసి ఉంటే పితృ దోషము వస్తుంది. ఈ 13వ తారీకు తదుపరి ఫిబ్రవరి మాసంలో ఎవరైతే జన్మించబోతూ ఉన్నారో, ఆ శిశువుల పైన ప్రభావం పడుతుంది. అందువల్ల ఎవరైనా ఫిబ్రవరి మాసంలో ఏదైనా, సిజేరియన్ ముహూర్తాలు, వీటి గురించి అడిగేటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి సూచన ప్రాయంగా ఒక మాట ఏమిటి అంటే, 13వ తారీకు లోపులో వీలుంటే కొంచెం పరిస్థితులు అవి సానుకూలంగా ఉంటే, ఈ సిజేరియన్ అవి కూడా ముహూర్తాలు మీరు చేసుకోవచ్చును. 13 దాటిన తర్వాత రవి రాహువుల యొక్క కలయక వల్ల పితృదోషం అనేటువంటిది ఏర్పడుతూ ఉన్నది. అలాగే ఈ పంచగ్రహ కూటములు దేశారిష్ట యోగములు ఇవన్నీ ఏర్పడుతున్నాయి, కాబట్టి అది కొంత జాతకం మీద ప్రభావాన్ని చూపెడుతుంది. కాబట్టి ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మరీ కాంప్లికేట్ అయిపోతే మాత్రం అంటే. ఈ లోపులోనే చేసేసుకోమని కాదు. ఏమన్నా అవకాశం ఉంటే, 13 లోపు ఈ సిజేరియన్లు, ఇవన్నీ కూడా చేయించుకోవడం ద్వారా, పితృ దోషాదులు రాకుండా ఉంటాయి. ఇది ఒక ప్రధానమైన విషయం. ఇది మీ ఆరోగ్యాన్ని బట్టి ముందుకు వెళ్ళండి. దీంట్లో ఇబ్బంది ఏమ లేదు .ఇంకొకటి ఏంటి అంటే శుక్ర బుధులు కూడా కుంభరాశి యందే సంచరించబోతున్నారు. అంటే ఇక్కడ నాలుగు గ్రహాలు రాహు గ్రహము, రవి గ్రహము, శుక్ర గ్రహము, బుధ గ్రహము, వీటితోటి చంద్రుడు కలిసినా లేదా ఈ మాసం చివరిలోనే కుజుడు కూడా కుంభంలోకి వెళ్ళబోతున్నారు. ఈ ఐదు గ్రహాలు వెరసి చంద్రుడితోటి కలిపి షగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతూ ఉన్నది కాబట్టి, ఈ గ్రహస్థితి వల్ల ఈ మాసంలో అటు దేశకాలమాన పరిస్థితులు ఎక్కువగా ప్రభావితం చెందబోతున్నాయి. దేశారిష్ట యోగం అనేటువంటిది పట్టబోతూ ఉన్నది. ఎందుకంటే అటు కుజరాహువుల యొక్క కలయక, అలాగే రవి రాహువుల యొక్క కలయక, ఇవన్నీ కూడా దేశారిష్ట యోగాలుగా చెప్పబడ్డాయి. ఈ సందర్భాల్లో ఎక్కువగా అగ్ని ప్రమాదాన్ని సూచించేటువంటి విషయాలు, అలాగే వాయుతత్వ రాశి యందు ఈ గ్రహస్థితి ఏర్పడుతూ ఉన్నది కాబట్టి, అతి వేగంగా వీచేటువంటి గాలుల వల్ల గాని, లేదా గాలి ద్వారా స్ప్రెడ్ అయ్యేటువంటివి ఏమన్నా ఉంటే, గ్యాస్ ద్వారా వచ్చేటువంటి విపత్తులు, లేదా అగ్ని సంబంధమైనటువంటి విపత్తులు, వాయు సంబంధమైనటువంటి విపత్తులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసమందు చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది

Updated On
ehatv

ehatv

Next Story