ఇంట్లో బొద్దింక వస్తే తీసేసి తినమా అంటూ విద్యార్థులను బెదిరించిన వంట సిబ్బంది.

ఎస్సీ బాలికల హాస్టల్లో(SC girls Hostel) సాంబారు, చట్నీలో వచ్చిన బొద్దింక(Cockroch). మహబూబ్ నగర్(Mahabubnagar) జిల్లా కలెక్టర్ బంగ్లా సమీపంలోని ఎస్సీ బాలికల హాస్టల్లో సాంబారు, చట్నీలో బొద్దింక రావడం కలకలం రేపింది. ఈ విషయమై వంట సిబ్బందిని అడిగితే ఇంట్లో బొద్దింక వస్తే తీసేసి తినమా అంటూ విద్యార్థులను బెదిరించిన వంట సిబ్బంది. దీంతో విద్యార్థి సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు.. సాంబారులో బొద్దింక వచ్చిందంటే ప్లేట్లోంచి పడేసి తినాలని సిబ్బంది చెబుతుండడం వారి నిర్లక్ష్యానికి నిదర్శమని మండిపడ్డారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story