పుదీనా మన ఆహారాలకు సువాసనలు ఇవ్వడంతో పాటు.. ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కూడా ప్రముఖ పాత్ర వహిస్తుంటుంది. పుదీనాను ప్లేవర్ కోసం మాత్రమే వాడుతుంటారు. నోటి దుర్వాసన తగ్గించడం కోసం నములుతుంటారు. కాని పుదీన వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో తెలుసా..?

1. పుదీనా ఆకులని(Mint leaves) శుభ్రంగా కడిగి ఉల్లి, మిరియాలు, వెల్లుల్లిపాయలు(Onions), జీలకర్ర(Zeera) వేసి మరిగించి అందులో కాస్త నిమ్మరసం కలుపుకుని తాగితే కడుపు ఉబ్బరం, పొట్ట సమస్యలు, కిడ్నీలో రాళ్లు, పిల్లల పేగు పురుగులు దూరమవుతాయి.
2. తేలికగా జీర్ణం(Digest) కావడానికి భోజనం తర్వాత కొంచెం పుదీనా సూప్ తాగండి.
3. మొటిమలు, పొడి చర్మం(Dry Skin) ఉన్నవారు రాత్రి పడుకునే ముందు పుదీనా సూప్ తాగాలి. ఎలర్జీలకు(allergy) కూడా పుదీనా రసం రాస్తే.. వెంటనే తగ్గిపోతుంది.
4. పుదీనాను నీడలో ఎండబెట్టి పొడి చేసి అందులో తాటి బెల్లం కలుపుకుని టీకి బదులు తాగితే రాత్రిపూట మంచి నిద్ర వస్తుంది.
5. శరీరంలో రోగనిరోధక శక్తిని పుదీనా పెంచుతుంది. అందుకే ప్రతీరోజూ ఆహారంలో పుదీనా చేర్చుకోవడం చాలా మంచింది.