మార్కెట్ కు వెళ్లి కూరగాయలు కొనేప్పుడు.. బీట్‌రూట్(Beetroot) కనిపించగానే.. చూసీ చూడనట్లు వదిలేస్తున్నారా? అయితే మీరు ఆరోగ్యా్న్ని అలా అంగట్లో నిర్లక్యంగా వదిలేసినట్లే. బీట్‌రూట్ శరీరానికి(Body) చేసే మేలు అంతా ఇంతా కాదు. పండ్లలో యాపిల్ ఎంత పవర్ ఫుల్‌గా పనిచేస్తుందో. కూరగాయల్లో బీట్‌రూట్ అంత కంటే మెరుగ్గా పనిచేస్తుంది. ముఖ్యంగా రోజూ బీట్‌రూట్ తింటే..

అనారోగ్యాన్ని బీట్ చేస్తారు. బరువు తగ్గాలన్నా(Weight Lose), రక్తహీనత(hemoglobin), గుండె సమస్యలను(Heart Problems) దూరం చేయాలన్నా.. బీట్‌రూట్ తప్పకుండా తినాల్సిందే. భూమిలో పండే బీట్‌రూట్ ఎన్నో రకాల పోషకాలను సంగ్రహిస్తుంది. మరి, పోషకాలు సమృద్ధిగా ఉండే బీట్ రూట్‌ను నిత్యం తీసుకుంటే శరీరానికి లభించే ప్రయోజనాలు ఏమిటో చూసేద్దామా
బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనతతో బాధపడేవారికి మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది. దీని వల్ల రక్తం త్వరగా తయారయ్యేందుకు ఎంతగానో ఉపయోగపడుతుంది. రోజు ఈ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత సమస్య నుంచి బయటపడవచ్చు. ఇక రోజంతా నీరసంగా ఉండేవారు ఉదయం సమయంలో బీట్‌రూట్ జ్యూస్ తాగితే రోజంతా హుషారుగా, ఉత్సాహంగా ఉండడమే కాకుండా ఎంతో శక్తి అందుతుంది.
బీట్‌రూట్ జ్యూస్(Beetroot Juice) వల్లచాలా ప్రయోజనాలు ఉన్నాయి. దీని రోగ నిరోధక(Immunity) లక్షణాలు క్యాన్సర్(Cancer) నుండి రక్షణ కల్పిస్తాయి మరియు రక్తంలో చక్కెర స్థాయిలను(Diabetes Level) నియంత్రించడానికి బీట్ రూట్ సహాయపడతాయి.బీటా సానిన్, పోషకాలు అధికంగా ఉండే యాంటీఆక్సిడెంట్, క్యాన్సర్ కారక ఫ్రీ రాడికల్స్‌తో పోరాడటానికి సహాయపడుతాయి.
బీట్‌రూట్ రసం లో రోగ నిరోధక లక్షణాలు రక్తం మరియు ఎముక మజ్జ క్యాన్సర్‌ను నయం చేయడంలో కూడా సహాయపడతాయి. ఈ ప్రక్రియలో బెటాస్యానిన్ కూడా సహాయపడుతుంది. బీట్‌రూట్ కొన్ని రకాల క్యాన్సర్‌లకు చికిత్స చేయడానికి ఉపయోగించే మందులలో డోక్సోరోబిసిన్ ఒకటి.