కూరగాయల్లో దొండకాయ అంటే తెలియని వారు ఉండరు ..ప్ర‌తి సీజ‌న్‌లోనూ విరివిరిగా దొరికే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ ఒక‌టి. దొండ‌కాయ‌తో ర‌క‌ర‌కాల కూర‌లు చేస్తుంటారు. దొండకాయతో కర్రీ ,వేపుడు చేసుకుంటూ రోటి పచ్చడి చేసుకుని తింటూ ఉంటాం . దొండకాయ వేపుడు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఇష్టపడుతారు.. మరికొంత మంది దొండకాయ తినడానికి ఇష్టపడరు ఉన్నాయి. పైగా ఈ దొండకాయ తింటే మెమరీ లాస్ అవుతుంది అని కొంత మంది బలంగా […]

కూరగాయల్లో దొండకాయ అంటే తెలియని వారు ఉండరు ..ప్ర‌తి సీజ‌న్‌లోనూ విరివిరిగా దొరికే కూర‌గాయ‌ల్లో దొండ‌కాయ ఒక‌టి. దొండ‌కాయ‌తో ర‌క‌ర‌కాల కూర‌లు చేస్తుంటారు. దొండకాయతో కర్రీ ,వేపుడు చేసుకుంటూ రోటి పచ్చడి చేసుకుని తింటూ ఉంటాం . దొండకాయ వేపుడు అంటే చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది ఇష్టపడుతారు.. మరికొంత మంది దొండకాయ తినడానికి ఇష్టపడరు ఉన్నాయి. పైగా ఈ దొండకాయ తింటే మెమరీ లాస్ అవుతుంది అని కొంత మంది బలంగా నమ్ముతారు. ఇదే నిజం అనుకొని దీన్ని తినకుండ దూరంగా పెట్టిన వాళ్ళు కూడా లేకపోలేదు . అయితే ఈ దొండకాయలో చాలా పోషకాలు ఉన్నాయి. ఇపుడు ఈ దొండకాయల తినడం వల్ల ప్రయోజనాలు ఏంటో చూద్దా౦.

దొండకాయ తినడం వలన ప్రయోజనాలు :-

మ‌ధుమేహం వ్యాధిగ్రస్తులు దొండ‌కాయ తింటే చాలా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.ఎందుకంటే, రక్తంలోని చెక్కర స్థాయిలను తగ్గించ‌డంలో దొండ‌కాయ‌ గ్రేట్‌గా స‌హాయ‌ప‌డుతుంది.

దొండకాయలో ఫైబర్ సమృద్ధిగా ఉంటు౦ది. దీని వలన బరువు తగ్గించడానికి కూడా సహాయపడుతుంది.

దొండకాయలో పొటాషియం సమృద్ధిగా ఉండటం వలన రక్తపోటు నియంత్రణలో ఉండటమే కాకుండా రక్త ప్రవాహం బాగా జరిగి గుండెకు సంబంధించిన సమస్యలు రాకుండా కాపాడుతుంది . రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది.

క్యాల్షియమ్, మెగ్నీషియమ్ వంటి పోష‌కాలు ఉన్న దొండకాయ తిన‌డం వ‌ల్ల ఎముక‌లు, దంతాలు దృఢంగా మార‌తాయి.

దొండ కాయ‌లో ఫైబర్ కూడా ఉంటుంది. అందుకే దొండ కాయ ను తీసుకోవ‌డం వ‌ల్ల జీర్ణ స‌మ‌స్య‌లు న‌యం అవ్వ‌డంతో పాటు మ‌ల‌బ‌ద్ధకం స‌మ‌స్య నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది.

దొండకాయ శరీరంలో క్యాన్సర్ కణాల పెరగకుండా చేస్తుంది .ఇన్ని పోష‌కాలు ఉన్న దొండ‌కాయ‌ను ఏదో ఒక రూపంలో తీసుకుంటే మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు.అయితే ఆరోగ్యానికి మంచిది కదా అని అతిగా తీసుకోవడం మంచిది కాదు అంటున్నారు వైద్య నిపుణులు.

Updated On 24 Feb 2023 7:49 AM GMT
Ehatv

Ehatv

Next Story