london to Italy For Pizza : పిజ్జా కోసం ఆ ఇద్దరమ్మాయిలు ఏం చేశారో తెలిస్తే షాక్ అవుతారు!
పిజ్జా(Pizza) అంటే చాలా మందికి ఇష్టమే కానీ, దాని కోసం వేలకు వేలు ఖర్చు పెట్టేంత ఇష్టమైతే ఉండదు. కానీ బ్రిటన్‌లోని(Britain) లివర్‌పూల్‌కు(Liverpool) చెందిన మోర్గాన్ బోల్డ్, జెస్ వుడర్‌లకు మాత్రం డబ్బు కంటే పిజానే ఇష్టం. ఎంతిష్టమంటే విమానంలో వెళ్లి మరీ పిజ్జా తినేసి వచ్చారు. మోర్గాన్ బోల్డ్, జెస్ వుడర్‌లిద్దరూ జిగ్రీ దోస్తులు. వీరిద్దరు ఎక్స్‌ట్రీమ్ డే ట్రిప్‌ను(Extreme day trip pla chestaru) ప్లాన్ చేశారు.
![london to Italy For Pizza london to Italy For Pizza](https://s3.ap-south-1.amazonaws.com/media.ehatv.com/wp-content/uploads/2024/05/pizza-compressed.jpg)
london to Italy For Pizza
పిజ్జా(Pizza) అంటే చాలా మందికి ఇష్టమే కానీ, దాని కోసం వేలకు వేలు ఖర్చు పెట్టేంత ఇష్టమైతే ఉండదు. కానీ బ్రిటన్‌లోని(Britain) లివర్‌పూల్‌కు(Liverpool) చెందిన మోర్గాన్ బోల్డ్, జెస్ వుడర్‌లకు మాత్రం డబ్బు కంటే పిజానే ఇష్టం. ఎంతిష్టమంటే విమానంలో వెళ్లి మరీ పిజ్జా తినేసి వచ్చారు. మోర్గాన్ బోల్డ్, జెస్ వుడర్‌లిద్దరూ జిగ్రీ దోస్తులు. వీరిద్దరు ఎక్స్‌ట్రీమ్ డే ట్రిప్‌ను(Extreme day trip pla chestaru) ప్లాన్ చేశారు. అంటే ఏమిటంటే ఒక్క రోజులోనే తిరిగి వచ్చేట్టు ట్రిప్ ప్లాన్ చేయడం. ఇందుకోసం వీరిద్దరు డే రిటర్న్ ఫైట్‌లను బుక్ చేసుకున్నారు. ఏప్రిల్ 24వ తేదీ ఉదయం ఆరు గంటలకు బయలుదేరి రాత్రి 11 గంటలకు ఇంటికి చేరే విధంగా ప్లాన్ చేసుకున్నారు. ఏప్రిల్ 24 మార్నింగ్ మాంచెస్టర్ ఎయిర్‌పోర్ట్‌లో విమానం ఎక్కి ఇటలీలోని(Italy) పిసాలో దిగారు. చక్కగా షాపింగ్ చేశారు. తమకు ఇష్టమైన పిజ్జాను ఆరగించారు. బోల్డ్, వుడర్ లీనింగ్ టవర్ ఆఫ్ పిసా ముందు ఫోటోలు దిగారు. గూగుల్ మ్యాప్‌లో మంచి పిజ్జాతో రెస్టారెంట్‌లకు వెతుక్కున్నారు. రాత్రికల్లా మళ్లీ లివర్‌పూల్ చేరుకున్నారు. విమానఛార్జీలు, ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఫీజు, ఫుడ్ కలిపి మొత్తం వీరికి అయిన ఖర్చు 170 పౌండ్లు. అంటే మన కరెన్సీలో 17 వేల 715 రూపాయలు. గమ్మత్తేమిటంటే లివర్‌పూల్ నుంచి లండన్‌కు వెళ్లాలంటే ఇంతకంటే ఎక్కువ ఖర్చు అవుతుందట! పైగా అక్కడ పిజ్జా, ఇతర డ్రింక్స్ ఖరీదు కూడా ఎక్కువేనట! అందుకే తాము అదే డబ్బుతో వేరే దేశం వెళ్లి వచ్చామని ఫ్రెండ్స్ చెప్పారు. పిసా టవర్‌ను చూస్తూ పిజ్జా తినడం అద్భుతమని, ఇక్కడ ఫుడ్డు రేట్లు రీజనబుల్‌గానే ఉన్నాయని తెలిపారు. వచ్చిన విమానంలోనే తిరిగి ఇంటికి వెళ్లడం ఇంకా బావుందని సంబరపడుతూ చెప్పారు మెర్గాన్ బోల్డ్, జెస్ వుడర్..
![Ehatv Ehatv](/images/authorplaceholder.jpg)