63 ఏళ్ల సెక్స్ ఎడ్యుకేటర్‌కు 15 ఏళ్ల బాలుడు ప్రపోజ్.. లైంగికంగా కలుద్దామని ఆఫర్..!

సీమా ఆనంద్ (Seema Anand) లండన్‌కు చెందిన పౌరాణిక శాస్త్రవేత్త. ప్రొపెషనల్ స్టోరీ టెల్లర్. ఆమె ది ఆర్ట్స్ ఆఫ్ సెడక్షన్ రచయిత్రి, భారతీయ సాహిత్యంపై ఆమె చేసిన కృషికి ప్రసిద్ధి చెందింది. మహాభారతం, రామాయణం, తాంత్రిక తత్వాలు, కామసూత్రం, భగవద్గీతపై ఆమె బోధనలు చేసి గుర్తింపు పొందారు. ఇన్‌స్టాగ్రామ్‌లో, ఆమెకు పది లక్షలకుపైగా ఫాలోవర్స్ ఉన్నారు. కామసూత్ర, శృంగారంపై బహిరంగంగా తన అభిప్రాయాలను స్వేచ్ఛగా చెప్పాలని ఆమె మహిళలను ఎడ్యుకేట్ చేస్తారు. సెక్స్ అనేది అత్యంత చర్చనీయాంశమైన, తప్పుగా అర్థం చేసుకోబడిన అంశాలలో ఒకటి. దాని చుట్టూ సంభాషణలు తరచుగా అసౌకర్యంగా ఉన్నప్పటికీ, ఆమె నిర్భయంగా ఈ విషయాలపై మాట్లాడుతారు.
అయితే ఇటీవల కాలంలో సీమా ఆనంద్ ఓ పాడ్‌కాస్ట్ (Semma Anand-Subhankar Podcast) ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై చర్చిస్తారు. అలాగే శృంగారంపై కూడా చర్చించారు. ఈ సందర్భంగా శుభంకర్ (Shubhankar) అనే యాంకర్ సీమా ఆనంద్‌ను ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అడిగాడు. వయసుపైడిన మహిళలపట్ల యువకులు ఎందుకు ఆకర్షిలవుతారు అని అడిగారు. దీనికి ఆమె చెప్పిన సమాధానం చూస్తే దిమ్మతిరుగుతుంది. తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించింది. గత ఏడాది తన దగ్గరికి వచ్చిన యువకుల్లో ఓ యువకుడి 15 ఏళ్లు ఉంటాయి. అతను తనతో లైంగికంగా పాల్గొనాలని కోరాడు. అప్పుడు తన వయసు 63 ఏళ్లు అని ఆమె తెలిపింది. తను నా కంటే వయసులో నాలుగు రెట్లు చిన్నవాడని తెలిపింది. అంతేకాకుండా తనను ఆ బాలుడు నానా దుర్భాషలాడాడు అన్నాడు అని కూడా వివరించింది. ఈ క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఇదే పాడ్‌కాస్ట్‌లో, శుభంకర్ మిశ్రా, సీమాఆనంద్‌ను గ్రూప్ సెక్స్ (Group Sex) గురించి అడిగాడు, అది “మంచిదా చెడ్డదా” అని ప్రశ్నించాడు. ప్రతిదీ పరస్పర అంగీకారంతో జరిగినంత వరకు దానిని మంచిదా చెడుదా అని పిలవడం తప్పు అని సమాధానం చెప్పింది. దీనికి శుభంకర్ మిశ్రా మరోసారి లేవనెత్తుతూ సమాజంలో, ముఖ్యంగా భారతీయ సందర్భంలో, దీనిని అనైతికంగా లేదా తప్పుగా పరిగణిస్తారు, కాదా?అని అడగా ఆమె ''మనం చరిత్రను పరిశీలిస్తే, భారతదేశంలో కామసూత్రం, ఖజురహో వంటి ఉదాహరణలు ఉన్నాయి. సమస్య విషయం కాదు, మన మనస్తత్వం మరియు విద్య లేకపోవడం'' అని సమాధానం ఇస్తుంది. ఇది నైతికతకు సంబంధించిన ప్రశ్న కాదని, మనస్తత్వం మరియు విద్య లేకపోవడం అని చెబుతున్నారా? శుభాంకర్ ప్రశ్నించగా.. ''కచ్చితంగా. ప్రజలు సమ్మతితో దీనిలో పాల్గొంటున్నంత కాలం, దానిపై “మంచి” లేదా “చెడు” లేబుల్ వేయడం సరైనది కాదని ఆమె బదులిస్తుంది.


