టెక్నాలజీ(Technology ) సూపర్‌స్పీడ్‌తో అభివృద్ధి చెందుతోంది.

టెక్నాలజీ(Technology ) సూపర్‌స్పీడ్‌తో అభివృద్ధి చెందుతోంది. ఇప్పటికే మనం 5 జీ వాడుతున్నాం. ఇప్పడు వైర్‌లెస్‌ (6జీ)(Wireless 6G Technology) టెక్నాలజీ కోసం పరుగులు పెడుతున్నాం. అయితే 6జీ టెక్నాలజీకి ప్రపంచం దగ్గరవుతున్నాం సరే, దాని వల్ల ఎదురయ్యే సమస్యల మాటేమిటని సైంటిస్టులు ప్రశ్నిస్తున్నారు. టెరాహెట్జ్‌ తరంగాలు 6జీ టెక్నాలజీకి వెన్నెముక లాంటివి. వీటి నుంచి ఓ రకమైన విద్యుదయస్కాంత రేడియో ధార్మికత (Electromagnetic Radiation) వెలువడుతుంది. వీటి వల్ల లాభాలతో పాటు నష్టాలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెరాహెట్జ్‌ తరంగాలతో మానవాళి ఆరోగ్యానికి(Human health) ముప్పు పొంచి ఉన్నదని ఆందోళన చెందుతున్నారు. పురుషులలో సంతానోత్పత్తి శక్తి(Sperm Production) తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story