Bryan Johnson in India.. I will not die.. These are my health details..! A 23-year-old man's statement in Bengaluru..!

ఇది బెంగళూరు బేస్డ్ ఎంట్రప్రెన్యూర్ పునర్వ్ దినాకర్ అనే 23 ఏళ్ల యువకుడి అరుదైన ప్రకటన చేశాడు. అతను Sedona Health అనే స్టార్టప్ ఫౌండర్, ఈ పోస్ట్‌లో తనను "భారతదేశపు బ్రయాన్ జాన్సన్" (Bryan Johnson of India) గా మార్చుకోవాలని అన్నాడు. బ్రయాన్ జాన్సన్ ఎవరంటే, అమెరికన్ టెక్ ఎంట్రప్రెన్యూర్, బయోహ్యాకర్, తన ప్రాజెక్ట్ బ్లూప్రింట్ ద్వారా వయసును రివర్స్ చేయడానికి మిలియన్లు ఖర్చు చేస్తున్నాడు. స్ట్రిక్ట్ డైట్, ఎక్సర్‌సైజ్, సప్లిమెంట్స్, బ్లడ్ టెస్ట్స్ ఇలా అన్నీ ట్రాక్ చేస్తాడు. అతను తన బయోలాజికల్ ఏజ్‌ను తగ్గించడానికి ఏటా $2 మిలియన్లు ఖర్చు చేస్తాడు. పునర్వ్ కూడా అలాంటి హెల్త్ ఆప్టిమైజేషన్ జర్నీ స్టార్ట్ చేశాడు, కానీ "ఎక్కువ కాలం జీవించడానికి" కాదు, "జీవితాన్ని పూర్తిగా జీవించడానికి" అని చెప్పాడు. ఇప్పటికే 7,000 విలువైన కాంప్రహెన్సివ్ బ్లడ్ టెస్ట్ చేయించుకున్నాడు.
అతను తన హెల్త్‌కు సంబంధించిన ప్రతి అంశంలోకి డీప్‌గా వెళ్లాలనుకుంటున్నాడు. డైట్, ఎక్సర్‌సైజ్, స్లీప్, జెనెటిక్స్ వంటి అన్నింటినీ ఎక్స్‌లో డాక్యుమెంట్ చేస్తానని చెప్పుకున్నాడు. పునర్వ్ సెడోనా హెల్త్ ఫౌండర్, ఇది హెల్త్ ట్రాకింగ్ టూల్. ఇండియాలో లాంగెవిటీ, బయోహ్యాకింగ్ ట్రెండ్ పెరుగుతోంది. ఇప్పటికే Zomato CEO Deepinder Goyal కూడా సిమిలర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు.
ఈ సందర్బంగా తాను చేసిన ప్రకటన అందరినీ ఆకర్షిస్తోంది. ''ఇది చదువుతున్న ప్రతి ఒక్కరికీ, హాయ్, నా పేరు పునర్వ్.
నా వయసు 23, ఈరోజు నుండి నేను భారతదేశపు బ్రయాన్ జాన్సన్ అవుతాను.
అన్ని ఇంప్ బయోమార్కర్లను కవర్ చేస్తూ 7 వేల విలువైన రక్త పరీక్ష చేయించుకున్నాను
నిద్ర, ఒత్తిడి మరియు కోలుకోవడాన్ని ట్రాక్ చేయడానికి గత నెలలో WHOOPని కొనుగోలు చేశాను
నా కార్యకలాపాలను ట్రాక్ చేయడానికి స్ట్రావా, నా కేలరీలను ట్రాక్ చేయడానికి అమీ, నా బయోమార్కర్లను ట్రాక్ చేయడానికి సెడోనా.
అయితే ఇది ప్రారంభం మాత్రమే. నా ఆరోగ్యం ప్రతి అంశంలోకి నేను చాలా లోతుగా వెళ్లాలనుకుంటున్నా. ఒకే తేడా ఏమిటంటే నేను దీన్ని "ఎక్కువ కాలం జీవించడానికి" కాదు, జీవితాన్ని పూర్తిగా జీవించడానికి చేస్తున్నాను. నేను కొలిచే, ట్రాక్ చేసే మరియు మెరుగుపరచే ప్రతి విషయాన్ని నేను ఇక్కడ డాక్యుమెంట్ చేస్తాను - కాబట్టి ఇది మీరు చేయాలనుకుంటున్నది అయితే, మీరు అనుసరించమని నేను మిమ్మల్ని కోరుతున్నాను'' అని ప్రకటించాడు.


