Covid Alert: ఏపీలో కరోనా అలెర్ట్..! జాగ్రత్తగా ఉండకుంటే చుట్టేస్తుంది..!

కోవిడ్-19 నేపథ్యంలో ఏపీ ఆరోగ్యశాఖ తాజాగా కొన్ని ముఖ్యమైన సూచనలు, జాగ్రత్తలు జారీ చేసింది. కోవిడ్ కేసులు కొన్ని ప్రాంతాల్లో నమోదవుతున్న నేపథ్యంలో, ప్రజలు తక్షణమే అప్రమత్తంగా ఉండాలని ఆరోగ్యశాఖ సూచించింది. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, విమానాశ్రయాల వంటి రద్దీ ప్రాంతాల్లో కోవిడ్ నిబంధనలు కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. కోవిడ్ వైరస్‌పై అవగాహన కల్పించేందుకు అధికారులు, వైద్య కార్యకర్తలు చురుగ్గా పనిచేయాలని ఆరోగ్యశాఖ ఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా, మాస్క్ ధరించడం, సామాజిక దూరం పాటించడం, చేతులు శుభ్రంగా కడుక్కోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. విశాఖపట్నంలో కొత్త కోవిడ్ కేసులు నమోదైనట్లు వార్తలు వచ్చాయి, దీంతో ఆరోగ్యశాఖ అలెర్ట్ అయింది. గతంలో కోవిడ్ సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న చర్యల ఆధారంగా, పరీక్షలు, ట్రాకింగ్, చికిత్స, వ్యాక్సినేషన్, కోవిడ్-అనుకూల ప్రవర్తనను పాటించేలా చర్యలు తీసుకుంటోంది. PPE కిట్లు, మాస్క్‌లు, ఔషధాలు, ఆక్సిజన్ సరఫరా వంటివి సమృద్ధిగా అందుబాటులో ఉన్నాయని ఆరోగ్య కమిషనర్ జె. నివాస్ తెలిపారు.

Updated On
ehatv

ehatv

Next Story