ప్రపంచాన్ని గడగడలాడించిన కరోరా వైరస్‌(Corona virus) లక్షలాది మంది ఉసురు తీసుకుంది.

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోరా వైరస్‌(Corona virus) లక్షలాది మంది ఉసురు తీసుకుంది. దానికి పది రెట్ల మందిని అనారోగ్యం పాలు చేసింది. దేశాల ఆర్ధిక వ్యవస్థలను(Country economy) చిన్నాభిన్నం చేసింది. ఇప్పుడు కరోనా వైరస్‌ నెమ్మదించింది కానీ ఆ వైరస్‌ ప్రభావం మాత్రం చాలా మందిని సలుపుతోంది. కోవిడ్‌ కారణంగానే ఉన్నట్టుండి అంగస్తంభనతో(erectile dysfunction) ఇబ్బంది పడుతున్నారు చాలా మంది. కోవిడ్‌ నుంచి బయటపడిన కొందరిలో అంగ స్తంభనలోపం ముప్పు పెరుగుతున్నదని తాజా అధ్యయనంలో తేలింది. కోవిడ్‌ కారణంగా రక్త నాళాలలో(Veins) కణాలు దెబ్బతిన్నాయట! ఫలితంగా అంగస్తంభనకు తగినంత రక్తం సరఫరా కావడం లేదట! మరోవైపు కోవిడ్‌ కారణంగా ఏర్పడిన మానసిక ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా సెక్స్‌ పట్ల(Sexual desires) ఆసక్తి తగ్గేలా చేశాయని అధ్యయనంలో తేలింది. కరోనా ఇన్‌ఫెక్షన్‌ తర్వాత టెస్టోస్టిరాన్‌ హార్మోన్‌(Harmones) మోతాదులు తగ్గుతున్నాయి. తీవ్ర ఇన్‌ఫెక్షన్‌ తలెత్తినవారిలో వైరస్‌ వృషణాలనూ దెబ్బతీసింది. అయితే ఈ అంగస్తంభన లోపం తాత్కాలికమేనట! కొన్నాళ్ల తర్వాత మామూలు స్థితికి వస్తారట! ఈ సమస్యతో బాధపడుతున్నవారు ఎందుకైనా మంచిది డాక్టర్‌ను సంప్రదించండి

Updated On
Eha Tv

Eha Tv

Next Story