1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది.

1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారి ప్రపంచాన్ని కుదిపేసింది. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. ఇప్పటికీ ఇలాంటి ప్రాణాంతక వ్యాధులపై డేంజర్‌ బెల్స్ ఆగడం లేదు. భవిష్యత్తులో మరో పేరులేని ప్రాణాంతక వ్యాధి ప్రజలను వెంటాడే ప్రమాదం ఉందని WHO హెచ్చరిస్తోంది. సాధారణంగా ఏదైనా అంటువ్యాది వస్తే అది ప్రపంచానికి వ్యాపించి ప్రజల ప్రాణాలను చిదిమేస్తుంది. గత 400 ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ఇదే ఈ విషయం వెల్లడైంది. 1720లో ప్లేగు, 1817లో కలరా, 1918లో స్పానిష్ ఫ్లూ, 2019లో కరోనా మహమ్మారులు ఇదే చేశాయి. ప్రపంచంలోని ఏ దేశమూ ఈ మహమ్మారి నుంచి బయటపడలేదు. ఈ ప్రాణాంతక వ్యాధుల బారిన పడి కోట్లాది మంది ప్రాణాలు కోల్పోయారు. స్పానిష్ ఫ్లూని “మదర్ ఆఫ్ ఆల్ ఎపిడెమిక్స్” అని కూడా అంటారు. దీని కారణంగా 5 కోట్లకు పైగా మరణాలు సంభవించాయి. మొన్నటికీ మొన్న కరోనా వైరస్ కూడా అంతే ప్రాణాంతకంగా మారింది. కరోనా వల్లా కోట్లాది మంది ప్రాణాలు పోయాయి.

ehatv

ehatv

Next Story