Elluru Government Hospitals : కడుపులో కత్తెర.. ఏలూరు ఆసుపత్రి వైద్యుల నిర్వాకం
ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి(Elluru Government Hospitals) వైద్యుల నిర్వాకం ఓ మహిళ ప్రాణం మీదకి వచ్చింది. వారం క్రితం ఆసుపత్రిలో కాన్పు(Delivery) కోసం ఓ గర్భిణీ(Pregnant) మహిళ చేరగా.. ఆమెకు వైద్యం చేసిన తర్వాత కడుపులో కత్తెరను మరచిపోయిన ఘటన కలకలం రేపుతుంది. దీంతో వైద్యుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే విషయం బయటకు పొక్కకుండా మళ్లీ ఆపరేషన్ నిర్వహించాలని వైద్యులు భావించారు. కానీ విషయం దాగలేదు.

Elluru Government Hospitals

వారం క్రితం వైద్యులు మహిళకు సిజేరియన్ చేసి పండంటి బిడ్డను బయటకు తీశారు. ఆపరేషన్ తర్వాత కుట్లు వేసే క్రమంలో కడుపులో ఉన్న కత్తెరను తీయడం మరిచిపోయారు. అప్పటి నుంచి బాధితురాలు తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతోంది. దీంతో వైద్యులు ఎక్స్‌రే తీయగా.. కడుపులో కత్తెర(scissors) ఉన్న విషయం వెలుగు చూసింది.
ఈ విషయం బయటి ప్రపంచానికి తెలియకుండా చేయాలని వైద్యులు ప్రయత్నించారు. ఎక్స్‌రే ఫొటోను ఓ ఉద్యోగి తన ఫేస్‌బుక్, ట్విటర్ ఖాతాల్లో పోస్టు చేశాడు. దీంతో ఈ వ్యవహారం మొత్తం బయటకు వచ్చింది. ఆసుపత్రి అధికారులు ఆ ఉద్యోగిని పిలిచి మందలించడంతో ఆ పోస్టులను తొలగించాడు. అప్పటికే ఈ విషయం బయటకు పొక్కడంతో స్థానికులు ఆందోళనకు దిగారు.