జ్వరమో(Fever), దగ్గో, నొప్పులో, ఎలర్జీనో వస్తే మందో మాకో తీసుకుంటాం! రోగం తగ్గుతుందనే భరోసాతో ఉంటాం.

జ్వరమో(Fever), దగ్గో, నొప్పులో, ఎలర్జీనో వస్తే మందో మాకో తీసుకుంటాం! రోగం తగ్గుతుందనే భరోసాతో ఉంటాం. అయితే తీసుకునే ఆ ఔషధమే హాని కలిగిస్తే అంతకు మించిన దారుణం ఉండదు కదా! ఇలాంటి ఔషధాలు చాలానే ఉన్నాయి. రోగులకు ముప్పు తెచ్చే ఓ 156 రకాల ఔషధాలను కేంద్ర ప్రభుత్వం గుర్తించి వాటిని నిషేధించింది. జ్వరం, జలుబు, అలర్జీ, దురద, నొప్పికి ఉపయోగించే 156 ఫిక్స్‌డ్‌ డోస్‌ కాంబినేషనల్‌ను(156 Fixed dose combination) నిషేధిస్తున్నట్లు ఆదేశాలు ఇచ్చింది. స్థిర మోతాదులో రెండు, అంతకంటే ఎక్కువ క్రియాశీల ఔషధ పదార్థాలను కలిపి వాడే మందులను (కాంబినేషన్‌ డ్రగ్స్‌)ను కాక్‌టెయిల్‌ డ్రగ్స్‌ అంటారు. ఇలాంటి మందుల ఉత్పత్తి, నిల్వ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ వెల్లడించింది. ఈ మందులు మనుషుల ఆరోగ్యానికి ముప్పు తెస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ మందులకు సురక్షితమైన ప్రత్యామ్నాయాలు ఉన్నాయని తెలిపింది. ఎసెక్లోఫెనాక్‌ 500 ఎంజీ + పారాసెటమాల్‌ 125 ఎంజీ మాత్రలను, మెఫెనమిక్‌ యాసిడ్‌ + పారాసెటమాల్‌ ఇంజెక్షన్, సెట్రిజెన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్, లెవొసెట్రిజిన్‌+ ఫినైలెప్రైన్‌ హెచ్‌సీఎల్‌+ పారాసెటమాల్‌ వంటివి నిషేధిత మందుల జాబితాలో ఉన్నాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story