రక్తంలో చక్కెర శాతం (బ్లడ్ షుగర్) పెరగడం, అంటే హైపర్‌గ్లైసీమియా, సాధారణంగా డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్‌తో సంబంధం ఉంటుంది.

రక్తంలో చక్కెర శాతం (బ్లడ్ షుగర్) పెరగడం, అంటే హైపర్‌గ్లైసీమియా, సాధారణంగా డయాబెటిస్ లేదా ప్రీ-డయాబెటిస్‌తో సంబంధం ఉంటుంది. ఈ పరిస్థితి లక్షణాలు అధిక దాహం, ఎక్కువగా నీరు తాగాలనిపించడం, తరచూ మూత్రవిసర్జన, సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్రం పోవడం, ముఖ్యంగా రాత్రివేళల్లో, అతిగా ఆకలి వేయడం, ఎంత తిన్నా తృప్తి లేకపోవడం, శరీరం ఎప్పుడూ అలసిపోయినట్లు లేదా శక్తిలేనట్లు అనిపించడం.
కళ్లు మసకగా కనిపించడం లేదా దృష్టిలో సమస్యలు, చర్మం పొడిబారడం, దురదలు లేదా గాయాలు త్వరగా మానకపోవడం, మూత్రాశయ ఇన్ఫెక్షన్, చర్మ ఇన్ఫెక్షన్లు తరచూ రావడం, రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఎక్కువగా ఉన్నప్పుడు తలనొప్పి లేదా మైకం రావచ్చు. బరువు తగ్గడం, మానసిక గందరగోళం: తీవ్రమైన సందర్భాల్లో, గందరగోళం లేదా ఏకాగ్రత సమస్యలు. ఈ లక్షణాలు అందరిలో ఒకే విధంగా కనిపించకపోవచ్చు, కొందరిలో ఎటువంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయని అనుమానం ఉంటే, వెంటనే వైద్యుడిని సంప్రదించి బ్లడ్ గ్లూకోస్ టెస్ట్ లేదా HbA1c టెస్ట్ చేయించుకోవడం ముఖ్యం.
డయాబెటిస్ లేని పెద్దలకు, ఉపవాసం చేసే వారిలో సాధారణంగా 70-100 mg/dl మధ్య ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. కానీ, రక్తంలో చక్కెర స్థాయి 100 నుంచి 125 mg/dl మధ్య ఉంటే ప్రీడయాబెటిస్ కండిషన్‌గా పరిగణిస్తారని తెలిపారు. ఈ క్రమంలో భోజనం చేసే ముందు రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణంగా 80-130 mg/dl మధ్య ఉండాలని, భోజనం చేసిన 2 గంటల తర్వాత 180 mg/dl కంటే తక్కువగా షుగర్ లెవల్స్ ఉండాలని ఓ అధ్యయనంలో పేర్కొంది . సాధారణంగా ఆరోగ్యకరమైన వ్యక్తులకు ఇది వర్తిస్తుందని నిపుణులు సూచిస్తున్నారు.రక్తంలో చక్కెర స్థాయిలను తనిఖీ చేసే ఫ్రీక్వెన్సీ వ్యక్తి చికిత్సా ప్రణాళిక, డయాబెటిస్ రకాన్ని బట్టి మారుతూ ఉంటుందని తెలిపారు.
