continue గా కూర్చున్నప్పుడు శరీరానికి అవసరమైన లైపోప్రొటీన్ లైపేస్ వంటి అణువులు విడుదల కాకపోవడంతో... బరువు పెరగడంతో పాటు ఊబకాయం వంటి వ్యాధులకు కారణం అవుతుంది. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఎక్కువ గంటలు కూర్చోవడంతో త్వరగా ఒత్తిడికి గురవుతారు. ఆందోళన పెరగడం వల్ల బీపీ, మధు మేహం, గుండెపోటు వంటి తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతుంది.

Sitting Disease
గంటల కొద్ది కూర్చొని చేసే ఉద్యోగాలు .. .తీరిక లేనంత పని . కాస్తా రిలాక్స్ అవ్వడానికి కూడా ఆలోచిస్తాం..... కానీ ఇలా గంటల కొద్ది కూర్చొని పనిచేయడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. దీనిపై అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య, ఆరోగ్య వెబ్సైట్ Hopkinsmedicine.org ఇటీవల ఓ సర్వే చేసింది. దాని నుంచి కొన్ని భయంకరమైన నిజాలు కూడా చెప్పింది.
అయితే గతంలో శారీరక శ్రమ ఎక్కువగా ఉండేది. మారుతున్న Technology తో ఇప్పుడు శారీరక శ్రమ అనేది లేకుండా పోయింది . హాయిగా ఏసీ రూమ్స్ లలో సౌకర్యవంతమైన కుర్చీల్లో కూర్చుని ఉద్యోగాలు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా కంటిన్యూగా ల్యాప్‌టాప్ లేదా మానిటర్ స్కీన్నే చూస్తూ ఉండిపోతున్నారు. పని మధ్యలో ఎలాంటి చిన్న బ్రేక్ లేకుండా కనీసం పక్కకు కూడా కదలకుండా గంటలపాటు అలా కూర్చోవడం వల్ల ...ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందంటున్నారు ప్రముఖ వైద్య, ఆరోగ్య వెబ్సైట్ సర్వే.... అంతేకాదు ఫ్యూచర్ లో హెల్త్ ఇష్యూస్ ఎదుర్కోవలసి వస్తుందని తాజా సర్వే చెబుతోంది.
అమెరికాకు చెందిన ఈ ప్రముఖ వైద్య, ఆరోగ్య వెబ్సైట్ Hopkinsmedicine.org సర్వే ప్రకారం .... 1950 నుంచి 2023 వరకు పోల్చి చూసుకుంటే కూర్చుని చేసే ఉద్యోగాల సంఖ్య 83% పెరిగినట్లు తన నివేదికలో పేర్కొంది. డిజిటల్ యుగంలో ‘The Sitting Disease’ అనేది పెద్ద సమస్యగా మారబోతుందని, దీని వల్ల భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలు వస్తాయని చెప్పింది. రోజూ ఏడు, ఎనిమిది గంటలపాటు ఒకేచోట కూర్చుని డిజిటల్ స్క్రీన్స్ చూడటం వల్ల మెడ, వెన్నుముక, వీపుభాగం, నరాలు, మెదడు మీద తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. దీని వల్ల మెడ లేదా వెన్నులో తీవ్రమైన నొప్పి వస్తుందని, స్పాండిలైటిస్ వంటి వాటికి కూడా దారి తీస్తుందంటున్నారు నిపుణులు.
అయితే రోజంతా కూర్చునే చేయాల్సిన జాబ్ అయితే మీరు ఏ విధంగా కూర్చున్నారనేది కూడా చాలా ముఖ్యం. వెన్నెముక నిటారుగా ఉండి, పనిచేసే మానిటర్ మీ ముఖానికి ఎదురుగా ఉంటే పర్వాలేదు. అలా కాకుండా పక్కకు ఒదిగిపోయి లేదా వంగిపోయి కూర్చున్నా, భుజాలు జారిపోయినట్లు ఉన్నా ఇబ్బందే. దీని వల్ల బాడీ లోని ఏ అవయవంపై అయితే ఎక్కువ ఒత్తిడి ఉంటుందో అక్కడ తీవ్రమైన నొప్పి వస్తుంది. వెన్నెముక డిస్క్‌లపై ప్రభావం చూపడంతో పాటు దీర్ఘకాలిక నొప్పికి కారణం అవుతుంది. ఎక్కువ సమయం కూర్చోవడంతో మీ శరీరం, మెదడు చాలా త్వరగా అలిసిపోతుంది. అది మీ పని, దినచర్యపై ప్రభావం చూపుతుంది. రోజంతా అలసటగా అనిపిస్తుంది.
continue గా కూర్చున్నప్పుడు శరీరానికి అవసరమైన లైపోప్రొటీన్ లైపేస్ వంటి అణువులు విడుదల కాకపోవడంతో... బరువు పెరగడంతో పాటు ఊబకాయం వంటి వ్యాధులకు కారణం అవుతుంది. దీని వల్ల ఇతర ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎటువంటి శారీరక శ్రమ లేకుండా ఎక్కువ గంటలు కూర్చోవడంతో త్వరగా ఒత్తిడికి గురవుతారు. ఆందోళన పెరగడం వల్ల బీపీ, మధు మేహం, గుండెపోటు వంటి తీవ్ర ప్రమాదాలకు కారణం అవుతుంది.
ఈ సమస్యల నుంచి తప్పించుకునేందుకు కొన్ని నియమాలు పాటించాలంటోంది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ .. రోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలని సూచిస్తున్నారు. పని సమయంలో గంటకు అయిదు నిమిషాలు బ్రేక్ తీసుకోవాలని సూచిస్తున్నారు.
