Three breasts Women: ప్రపంచంలో మూడు వక్షాలు ఉన్న మహిళ.. నిజమా? అదెలా..? చిన్న ఎనాలసిస్..!

ఇటీవల సోషల్ మీడియా, యూట్యూబ్, ట్యాబ్లాయిడ్ కథనాల్లో "జాస్మిన్ అనే మహిళకు మూడు వక్షాలు ఉన్నాయి" అనే వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. అసలు ఇది నిజమేనా? మహిళకు సహజంగా మూడు వక్షాలు ఉండటం సాధ్యమా? లేక ఇది కేవలం పబ్లిసిటీ కోసమా? మహిళకు సహజంగా మూడు వక్షాలు ఉండటం సాధ్యమేనా?

మెడికల్ నిపుణుల ప్రకారం, అవును, కానీ ఇది అత్యంత అరుదైన జన్యుపరమైన పరిస్థితి. ఈ పరిస్థితిని మెడికల్ భాషలో Polythelia (అదనపు నిపుల్) అంటారు. Supernumerary Breast (అదనపు వక్షం) అని పిలుస్తారు. ఇది పుట్టుకతోనే ఏర్పడే పరిస్థితి (Congenital Condition). కొందరిలో చిన్న నిపుల్ మాత్రమే ఉండొచ్చు, లేదా పూర్తిగా అభివృద్ధి చెందిన మూడో వక్షం కూడా ఉండొచ్చు

ఈ మూడో వక్షం శరీరంలో ఎక్కడ ఏర్పడుతుంది?

మన శరీరంలో Milk Line (మామరీ రిడ్జ్) అనే ఒక రేఖ ఉంటుంది. ఈ రేఖ చంక నుంచి ఛాతీ భాగం మీదుగా పొట్ట ప్రాంతం వరకు విస్తరించి ఉంటుంది. ఈ లైన్‌పై ఎక్కడైనా అదనపు వక్షం ఏర్పడే అవకాశం ఉంటుందని డాక్టర్లు చెబుతున్నారు. మెడికల్ స్టడీస్ ప్రకారం ప్రపంచ జనాభాలో 2% నుండి 6% మందికి ఏదో ఒక రూపంలో అదనపు నిపుల్ ఉంటుంది. కానీ పూర్తిగా అభివృద్ధి చెందిన మూడో వక్షం కేసులు చాలా చాలా అరుదు

జాస్మిన్ అనే మహిళ తనకు సహజంగానే మూడు వక్షాలు ఉన్నాయని చెబుతోంది. మెడికల్ కోణంలో చూస్తే ఇది పూర్తిగా అసాధ్యం కాదు. కానీ అధికారిక మెడికల్ రిపోర్ట్స్ లేకుండా కచ్చితంగా నిర్ధారించడం కష్టం. అయితే ప్రపంచంలో గతంలో కూడా ఇలాంటి అరుదైన కేసులు నమోదైన విషయం నిజమే.

మూడో వక్షం ఇంప్లాంట్ చేయించుకోవచ్చా? ప్లాస్టిక్ సర్జరీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, థియరీగా మూడో వక్షం ఇంప్లాంట్ చేయడం సాధ్యమే

కానీ ఇది మెడికల్ అవసరం కాదు, కేవలం కాస్మెటిక్ లేదా వ్యక్తిగత అభిరుచుల కోసం మాత్రమే. కొన్ని సందర్భాల్లో ఫిల్మ్ క్యారెక్టర్ల కోసం,

ఆర్ట్ పర్ఫార్మెన్స్ కోసం, షాకింగ్ పబ్లిసిటీ కోసం ఇలాంటి సర్జరీలు జరిగినట్లు కథనాలు ఉన్నాయి.

ప్రపంచవ్యాప్తంగా కొందరు మహిళలు మూడో వక్షం ఇంప్లాంట్ చేయించుకున్నామని క్లెయిమ్ చేశారు. కానీ చాలా సందర్భాల్లో అవి తాత్కాలిక సిలికాన్ ప్రోస్తేటిక్స్, మేకప్ ఎఫెక్ట్స్, లేదా ఫేక్ క్లెయిమ్స్ అయ్యి ఉండవొచ్చు. శాశ్వత మూడో వక్షం సర్జరీ చేసిన అధికారిక మెడికల్ కేసులు చాలా తక్కువ. ఆరోగ్యపరమైన ప్రమాదాలు ఉన్నాయా అని అడిగితే, డాక్టర్లు చెబుతున్నదేమిటంటే సహజంగా ఉన్న అదనపు వక్షం సాధారణంగా ప్రమాదకరం కాదు, కానీ హార్మోనల్ మార్పుల సమయంలో నొప్పి, వాపు, అరుదుగా బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ ఉండే అవకాశం.

Updated On
ehatv

ehatv

Next Story