నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ (అమెరికా) సైంటిస్టులు చేసిన ఈ డెవలప్‌మెంట్ క్యాన్సర్ చికిత్సలో రియల్ గేమ్-చేంజర్.

నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ (అమెరికా) సైంటిస్టులు చేసిన ఈ డెవలప్‌మెంట్ క్యాన్సర్ చికిత్సలో రియల్ గేమ్-చేంజర్. నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ సైంటిస్టులు కీమోథెరపీ ఔషధాన్ని నానోటెక్నాలజీతో పునఃరూపకల్పన చేసి క్యాన్సర్ చికిత్సలో పెనుమార్పు తీసుకొచ్చారు. దుష్ప్రభావాలు కలిగించే 5-ఫ్లోరోయురాసిల్ (5-Fu) ఔషధాన్ని, స్ఫెరికల్ న్యూక్లియిక్ యాసిడ్ (SNA)గా మార్చారు. ఇది లుకేమియా కణాలను 20,000 రెట్లు ప్రభావవంతంగా నాశనం చేస్తుంది. ఇది ఆరోగ్యకరమైన కణజాలానికి హాని చేయకుండా క్యాన్సర్ కణాలనే లక్ష్యంగా చేసుకుంటుంది. ఆరోగ్యకరమైన సెల్స్‌కి ఎటువంటి హాని లేదు, సైడ్ ఎఫెక్ట్స్ కూడా జీరో. ఇంకా ఎనిమల్ మోడల్స్‌లోనే టెస్ట్ అయింది. మనుషులపై క్లినికల్ ట్రయల్స్ కోసం ప్లాన్ చేస్తున్నారు. చాడ్ ఎ. మిర్కిన్ ఈ బృందానికి నాయకత్వం వహించారు. ఆయన నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీలో కెమిస్ట్రీ, మెటీరియల్స్ సైన్స్ ప్రొఫెసర్, అలాగే ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నానోటెక్నాలజీ ఫౌండర్. సాంప్రదాయ 5-FU డ్రగ్ పూర్‌గా సాల్యుబుల్ కాదు, క్యాన్సర్ సెల్స్‌లోకి సరిగ్గా ఎంటర్ కాదు, హెల్తీ సెల్స్‌కి కూడా డ్యామేజ్ చేస్తుంది. క్యాన్సర్ సెల్స్‌లోకి 12.5 రెట్లు ఎక్కువ ఎఫిషియెంట్‌గా ఎంటర్ అవుతుంది. 59 రెట్లు క్యాన్సర్ సెల్స్‌ను తగ్గిస్తుంది. రక్తం, స్ప్లీన్‌లో ల్యూకీమియా సెల్స్‌ని అతి తక్కువగా చేస్తుంది. సర్వైవల్ రేట్ గణనీయంగా పెరిగింది, సైడ్ ఎఫెక్ట్స్ జీరో. మిర్కిన్ ల్యాబ్‌లో ఇప్పటికే 7 SNA-బేస్డ్ థెరపీలు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి


