పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన 9 ఏళ్ల శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది.

పుష్ప-2 ప్రీమియర్ సందర్భంగా సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో గాయపడిన 9 ఏళ్ల శ్రీతేజ్ పరిస్థితి ఎలా ఉంది. శ్రీతేజ్ ఏప్రిల్ 29న సికింద్రాబాద్‌లోని కిమ్స్‌ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఇప్పుడు అతడిని ఆసియన్ ట్రాన్స్‌కేర్ న్యూరోరిహాబిలిటేషన్ సెంటర్ సికింద్రాబాద్‌(Secundrabad)కు తరలించారు. శ్రీతేజ్‌ (Sritej)ఇప్పుడు ఆక్సిజన్ లేదా రెస్పిరేటరీ సపోర్ట్ లేకుండా స్వయంగా శ్వాస తీసుకోగలుగుతున్నాడు. నోటి ద్వారా ఆహారం తీసుకుంటున్నాడు. అయితే, న్యూరోలాజికల్‌(neurological)గా అతడు ఇంకా పూర్తిగా కోలుకోలేదు. కళ్లు తెరిచి చూస్తున్నప్పటికీ, కుటుంబ సభ్యులను గుర్తుపట్టలేకపోతున్నాడు. శ్రీతేజ్ పరిస్థితి స్థిరంగా ఉంది, కానీ పూర్తి కోలుకోవడానికి ఇంకా చాలా సమయం పట్టవచ్చు. రిహాబిలిటేషన్ సెంటర్‌లో 15 రోజుల చికిత్స తర్వాత ఇంటికి తీసుకెళ్లే అవకాశం ఉందని ఆశిస్తున్నారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆ సమయంలో అతడు సెమీ-కాన్షియస్ స్థితిలో ఉన్నాడు, ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండడం, శ్వాస సమస్యల కారణంగా వెంటిలేటర్‌పై ఉంచారు. నాటి హెల్త్ బులెటిన్‌లో, శ్రీతేజ్‌కు ఆక్సిజన్ సరఫరా లేకపోవడం వల్ల మెదడు దెబ్బతిన్నట్లు వైద్యులు ధృవీకరించారు. అతడి న్యూరోలాజికల్ పరిస్థితి స్థిరంగా ఉన్నప్పటికీ, కోలుకోవడానికి చాలా సమయం పడుతుందని తెలిపారు. అల్లు అర్జున్, పుష్ప-2 (Pushpa 2)టీం శ్రీతేజ్ చికిత్స కోసం అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్(Sukumar), మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, అల్లు అరవింద్, బన్నీ వాసు ఆర్థిక సహాయం అందించారు. .అల్లు అరవింద్ కూడా రిహాబ్ సెంటర్‌లో శ్రీతేజ్‌ దగ్గరకు వెళ్లి అతడి ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఈ తొక్కిసలాటలో శ్రీతేజ్ తల్లి రేవతి(Revathi) (35) మరణించింది, శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు. శ్రీతేజ్ అల్లు అర్జున్‌కు పెద్ద అభిమాని, “పుష్ప” సినిమాలో అతడి మేనరిజమ్‌లను అనుకరించేవాడని, అందుకే అతడు ఈ ప్రీమియర్‌కు తన తల్లితో వచ్చాడని కుటుంబం తెలిపింది.

ehatv

ehatv

Next Story