30-year-old woman has 16 kg of fibroids in her uterus..!

సాధారణంగా ఫైబ్రాయిడ్లు చాలా సాధారణం, 50 సంవత్సరాల వయస్సులో 60-70% మంది స్త్రీలను ప్రభావితం చేస్తాయి, కానీ భారీ ఫైబ్రాయిడ్లు చాలా అరుదు. 10 కిలోలు లేదా అంతకంటే ఎక్కువ బరువున్న భారీ ఫైబ్రాయిడ్లు 1% కంటే తక్కువ ఉంటాయి. ముందుగా గుర్తించకపోవడం, స్క్రీనింగ్ పరీక్షలు లేకపోవడం వల్ల ఫైబ్రాయిడ్ల పెరిగిపోతుంటాయి. అయితే ఢిల్లీలోని ఫరీదాబాద్‌లో ఒక అరుదైన కేసు నమోదైంది. ఓ మహిళకు తనకున్న సమస్యల వల్ల ఫైబ్రాయిడ్ పెరగడం స్టార్ట్ అయింది. ఆమె తరుచుగా టెస్టులు చేయించుకోకపోవడంతో అది పెరిగి పెద్దదైంది. చివరికి 16 కిలోల వరకు ఆ ఫైబ్రాయిడ్ పెరిగింది. ఫైబ్రాయిడ్లు - గర్భాశయంలో క్యాన్సర్ కాని పెరుగుదల - 10-15 కిలోల కంటే ఎక్కువ బరువున్నవి అరుదు, ఫైబ్రాయిడ్లు ఉన్న 1,000 మంది మహిళల్లో 1 మందికి ఇది సంభవిస్తుందని జర్నల్ ఆఫ్ మెడికల్ కేస్ రిపోర్ట్స్ తెలిపింది. ఆమెకు చికిత్స చేసి 16 కిలోల ఫైబ్రాయిడ్ తొలగించినట్లు క్లౌడ్‌నైన్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ ఫెర్టిలిటీ విభాగం డైరెక్టర్ డాక్టర్ లక్ష్మీ గోయెల్ తెలిపారు.
రెండు సార్లు ఆమెకు అబార్షన్ అయిందని, ఆమె 2023 నుంచి బరువు పెరుగుతూ వస్తోందని, ఆరు నెలల్లో మరింత పెరిగిందని గుర్తించామని డాక్టర్ అన్నారు. అల్ట్రాసోనోగ్రఫీ ద్వారా 30×26 సెం.మీ. పరిమాణంలో ఉన్న భారీ ఫైబ్రాయిడ్‌ను గుర్తించారు.
మహిళలలో అలసట, బరువు పెరగడం లేదా ఒత్తిడి, సాధారణ హార్మోన్ల మార్పులు వంటి జీవనశైలి కారణంగా ఈ ఫైబ్రాయిడ్లు ఏర్పడతాయని లక్ష్మీగోయెల్ అన్నారు. సాధారణ కంటి పరీక్షలు, అల్ట్రాసౌండ్‌ల తరుచుగా చేయడం వల్ల ఫైబ్రాయిడ్‌లను నివారించే అవకాశం ఉందని వైద్యులు చెప్తున్నారు. "కటి పరీక్షలు, తరుచుగా పీరియడ్స్ రాకపోవడం, ఇన్ఫెక్షన్లు, హార్మోన్ల అసమతుల్యతలు వీటికి కారణమంటున్నారు. ఇవి దీర్ఘకాలిక లేదా ప్రాణాంతక వ్యాధులకు దారితీస్తాయని.. క్రమం తప్పకుండా పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. పెరుగుతున్న ఊబకాయం, జీవనశైలి కొవ్వు కణజాలం నుండి ఈస్ట్రోజెన్ ఉత్పత్తిని పెంచుతుంది, ఇది ఫైబ్రాయిడ్ ప్రమాదాన్ని నేరుగా పెంచుతుంది. దీర్ఘకాలిక ఒత్తిడి, నిద్రలేమీ, హార్మోన్ల అంతరాయం శరీరం ఎండోక్రైన్ సమతుల్యతను ప్రభావితం చేస్తుంది, అసాధారణ గర్భాశయ కణజాల పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. స్త్రీలు తమ జీవనశైలిని మార్చుకొని, ఎప్పటికప్పుడు స్క్రీనింగ్ టెస్టులు చేయించుకోవాలని డా.లక్ష్మీగోయెల్ సూచింస్తున్నారు


