బీటా హలాస్సీ(Bita halassi) (49) అనే శాస్త్రవేత్తకు(Scientist) 2020లో రొమ్ము క్యాన్సర్‌(Chest cancer) రావడంతో తన ఎడమ రొమ్మును తొలగించారు

బీటా హలాస్సీ(Bita halassi) (49) అనే శాస్త్రవేత్తకు(Scientist) 2020లో రొమ్ము క్యాన్సర్‌(Chest cancer) రావడంతో తన ఎడమ రొమ్మును తొలగించారు. ఆ తర్వాత కుడి రొమ్ముకు కూడా క్యాన్సర్‌ సోకింది. దీంతో కీమోథెరపీని(chemotherapy) మరోసారి భరించే శక్తి ఆమెకు లేదు. జాగ్రెబ్ విశ్వవిద్యాలయంలో వైరాలజిస్ట్ అయిన బీటా హలాస్సీ తనకు సోకిన క్యాన్సర్‌కు తానే చికిత్స చేయించుకోవాలని నిర్ణయించుకుంది. బీటా హలాస్సీ తన రొమ్ముకు ఫేజ్-3 క్యాన్సర్‌ రావడంతో ఆంకోలైటిక్ వైరోథెరపీ (OVT) అనే చికిత్సను విజయవంతంగా నిర్వహించుకుంది. నాలుగేళ్లుగా ఆమె ఆరోగ్యంగా ఉంది. ఆంకోలైటిక్ వైరోథెరపీ అనేది క్యాన్సర్‌పై పోరాడుతుంది, ఇది క్యాన్సర్ కణాలతో పోరాడి రోగనిరోధక వ్యవస్థను పెంపొందించేందుకు దోహదపడుతుంది. అయితే ప్రపంచంలో ఎక్కడైనా ఏ దశలోనైనా రొమ్ము క్యాన్సర్‌కు చికిత్స చేయడానికి ఆమోదించబడిన OVT ఏజెంట్‌లు ఏవీ లేవు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story