✕
ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ బాధితులు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1806 పాజిటివ్ కేసులు నమోదు.

x
ఏపీలో రోజురోజుకీ పెరుగుతున్న స్క్రబ్ టైఫస్ బాధితులు.ఈ ఏడాదిలో ఇప్పటివరకు 1806 పాజిటివ్ కేసులు నమోదు.. 15కి చేరిన మరణాల సంఖ్య. చిగ్గర్ అనే చిన్న పురుగు కాటు ద్వారా సోకే ఈ వ్యాధి మొదట సాధారణ జ్వరంలా కనిపించినప్పటికీ, నిర్లక్ష్యం చేస్తే ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉంది. అధిక జ్వరం, తలనొప్పి, శరీర నొప్పులు, చర్మంపై దద్దుర్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ముఖ్యంగా గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ వ్యాధి ఎక్కువగా నమోదవుతుండటంతో వైద్యులు అప్రమత్తం చేశారు. జ్వరం 3–4 రోజులు తగ్గకపోతే వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని, సమయానికి చికిత్స చేస్తే స్క్రబ్ టైఫస్ పూర్తిగా నయం అవుతుందని వైద్యులు సూచిస్తున్నారు.

ehatv
Next Story

