Garlic Belfits: వెల్లుల్లి చేసే మేలు కూడా తల్లి చేసే మేలు లాంటిదే..!

మన కిచెన్‌లో ఉండే వెల్లుల్లి (ఎల్లిపాయ)తో వంటలకు రుచి మాత్రమే కాకుండా, రోజూ ఒకటి, రెండు ఎల్లిపాయలు తింటే ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. వెల్లుల్లి ఒక సహజ సిద్ధమైన యాంటీబయాటిక్‌గ.రు. రక్తపోటు, మధుమేహం వరకు అనేక దీర్ఘకాలిక సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారం. ప్రతిరోజూ మనం తీసుకునే ఆహారంలో వెల్లుల్లిని సరైన పద్ధతిలో చేర్చుకుంటే ఆరోగ్యానికి కొదువ ఉండదని సూచిస్తున్నారు. హృదయ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి వెల్లుల్లి వరంలాంటింది. దీనిలో ఉండే ‘అల్లిసిన్’ అనే సమ్మేళనం శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయిన కొవ్వును కరిగించి, రక్త ప్రసరణ సాఫీగా జరిగేలా చూస్తుంది. ఫలితంగా రక్తపోటు అదుపులోకి వస్తుంది. గుండెపోటు వంటి ప్రమాదాలను నివారించడంలో ఇది అద్భుతంగా పనిచేస్తుంది. రోజూ పరగడుపున ఒక చిన్న వెల్లుల్లి రెబ్బను నీటితో కలిపి తీసుకోవడం వల్ల రక్తం పలుచబడి, గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
అంతేకాదు రక్తంలో ఉండే చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది. షుగర్ లెవల్స్‌ను స్థిరంగా ఉంచుతుంది.బవెల్లుల్లిలో యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ లక్షణాలుంటాయి. ఇవి శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందించి, జలుబు, దగ్గు వంటి ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంలోనూ, శరీరంలోని విషతుల్యాలను బయటకు పంపడంలోనూ మించింది మరేదీ లేదని నిపుణులు చెప్తున్నారు.


