ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే శరీరం, మనసు, ఆత్మ మూడూ బ్యాలెన్స్‌లో ఉండటమే. ఇది కష్టం కాదు, కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే సరి.

ఆరోగ్యకరమైన జీవనశైలి అంటే శరీరం, మనసు, ఆత్మ మూడూ బ్యాలెన్స్‌లో ఉండటమే. ఇది కష్టం కాదు, కొన్ని సింపుల్ హ్యాబిట్స్ ఫాలో అయితే సరి.

1. ఆహారం (Food): ప్రోటీన్ (గుడ్లు, చికెన్, చేపలు, పప్పులు), కార్బ్స్ (బ్రౌన్ రైస్, గోధుమ రొట్టె), ఫైబర్ (కూరగాయలు, పండ్లు), హెల్తీ ఫ్యాట్స్ (ఆలివ్ ఆయిల్, అవకాడో, బాదం). రోజుకి 4-5 సార్లు తక్కువ మోతాదులో తినాలి, ఒకేసారి బాగా తినొద్దు.

ఏం తగ్గించాలి: షుగర్, ప్రాసెస్డ్ ఫుడ్స్ (చిప్స్, సాఫ్ట్ డ్రింక్స్), ట్రాన్స్ ఫ్యాట్స్ (ఫ్రైడ్ స్నాక్స్). సాల్ట్ ఎక్కువైతే బీపీ పెరిగే అవకాశం. రోజుకి 2.5-3 లీటర్ల నీళ్లు తాగాలి. ఉదయం లేవగానే ఒక గ్లాస్ గోరువెచ్చని నీరు తాగితే జీర్ణ వ్యవస్థ బాగుంటుంది.

2. వ్యాయామం (Yoga ): రోజుకి కనీసం 30 నిమిషాలు ఏదో ఒక యాక్టివిటీ చేయాలి. వాకింగ్, జాగింగ్, సైక్లింగ్ లేదా జిమ్‌లో వెయిట్ లిఫ్టింగ్. యోగా సూర్యనమస్కారాలు, ప్రాణాయామం. రెగ్యులర్‌గా చేస్తే ఒబేసిటీ, డయాబెటిస్, గుండె జబ్బుల రిస్క్ తగ్గుతుంది. బిజీ అయితే ఇంట్లోనే స్కిప్పింగ్ లేదా స్టెయిర్ క్లైంబింగ్.

3. నిద్ర (Sleeping): రోజుకి 7-8 గంటలు నిద్ర పోవాలి. ఫోన్, లాప్‌టాప్ స్క్రీన్‌లు నిద్రకు గంట ముందు ఆఫ్ చేయాలి. రెగ్యులర్ స్లీప్ షెడ్యూల్ సెట్ చేసుకోవాలి.

4. మానసిక ఆరోగ్యం: స్ట్రెస్ మేనేజ్‌మెంట్ అంటే మెడిటేషన్ రోజుకి 10 నిమిషాలు, డీప్ బ్రీతింగ్. హాబీస్ (మ్యూజిక్, పెయింటింగ్, గార్డెనింగ్) స్ట్రెస్‌ను తగ్గిస్తాయి. ఫ్రెండ్స్, ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలి. సోషల్ మీడియా ఎక్కువ వాడకుండా రియల్ లైఫ్ ఎంజాయ్ చేయాలి.

5. చెడు అలవాట్లు తగ్గించుకోవాలి: స్మోకింగ్, ఆల్కహాల్: ఇవి లివర్, లంగ్స్, గుండెను డ్యామేజ్ చేస్తాయి. ఇది మానేయడానికి ప్రయత్నించాలి.

కాఫీ/టీ రోజుకి 1-2 కప్స్ కంటే ఎక్కువ తీసుకోకూడదు.

6. రెగ్యులర్ హెల్త్ చెకప్స్: సంవత్సరానికి ఒకసారి బ్లడ్ టెస్ట్, బీపీ, షుగర్ చెక్ చేయించుకోవాలి. డెంటల్ చెకప్, ఐ చెకప్ కూడా మర్చిపోవద్దు.

Updated On 2 May 2025 2:30 PM GMT
ehatv

ehatv

Next Story