సెక్స్(Romance) ఎప్పుడైనా ఆనందాన్ని అందిస్తుంది, సెక్స్‌ పాల్గొనడం వల్ల శారీరక ప్రశాంతత(Physical relax) మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది

సెక్స్(Romance) ఎప్పుడైనా ఆనందాన్ని అందిస్తుంది, సెక్స్‌ పాల్గొనడం వల్ల శారీరక ప్రశాంతత(Physical relax) మాత్రమే కాదు, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. అయితే ఉదయం పూట సెక్స్ చాలా మంచిదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. ఉదయం పూట సెక్స్‌లో పాల్గొంటే టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ స్థాయిలు గరిష్ట స్థాయికి చేరుకోవడం వలన లిబిడో పెరుగుతుంది. ఉదయం సంభోగం ప్రయోజనకరంగా ఉంటుందని చెప్తున్నారు.

మార్నింగ్ సెక్స్ గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం ద్వారా గుండెపోటును ఎదుర్కొనే అవకాశాలను తగ్గిస్తుంది. మార్నింగ్ సెక్స్‌లో పాల్గొనడం వల్ల సంతానోత్పత్తి అవకాశాలు పెరుగుతాయి. అంతేకాకుకుండా ఉదయం సెక్స్‌లో పాల్గొంటే శారీరక శ్రమ కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది, ఇది బరువు తగ్గేందుకు కూడా దోహదపడుతుంది. ఉదయపు సెక్స్‌తో ఈస్ట్రోజెన్ స్థాయిలు పెరిగి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి, ప్రకాశవంతమైన చర్మ సౌందర్యం వస్తుంది.

మార్నింగ్ సెక్స్ ఆక్సిటోసిన్ స్రావాన్ని పెంచుతుంది, డిప్రెషన్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం సెక్స్ వల్ల కలిగే రసాయన ప్రతిచర్యలు ఎక్కువ సంతృప్తి మరియు ఆనందానికి దారితీస్తాయి, ఇది ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. ఉదయం సెక్స్ మరింత ఆనందదాయకంగా ఉండడమే కాకుండా ఈ సమయంలో వీర్యం నాణ్యత మెరుగ్గా ఉంటుంది. జుట్టు రాలడాన్ని కూడా తగ్గిస్తుందని ఆరోగ్య రంగ నిపుణులు చెప్తున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story