షడ్రుచులు మనకు ఇంపార్టెంటే! కాకపోతే దేన్నీ అతిగా పుచ్చుకోవద్దు. రుచి కోసం ఉప్పు(Salt) వేస్తుంటాం! అది కూడా మితంగానే! కొందరికి ఉప్పు మోతాదు కాసింత ఎక్కువగా ఉండాలి.

షడ్రుచులు మనకు ఇంపార్టెంటే! కాకపోతే దేన్నీ అతిగా పుచ్చుకోవద్దు. రుచి కోసం ఉప్పు(Salt) వేస్తుంటాం! అది కూడా మితంగానే! కొందరికి ఉప్పు మోతాదు కాసింత ఎక్కువగా ఉండాలి. అలాంటి వారికి కంచంలో ఉప్పు కంపల్సరీగా ఉండాలి. అది ఎంత డేంజరో(Danger) బహుశా వారికి తెలియకపోవచ్చు. ఉప్పు ఎక్కువగా తినే వ్యక్తులు తీవ్రమైన వ్యాధుల బారిన పడతారు. చర్మం(skin Problems) కూడా పాడవుతుంది. అధిక రక్తపోటు(Blood pressure), గుండె జబ్బులు(Heart problems) సర్వ సాధారణం. శరీరంలో ఉప్పు పరిమానం పెరిగితే అది అనేక సమస్యలకు దారి తీస్తుంది. ఉప్పును ఎక్కువగా తీసుకునే వారి మొహంలో మార్పులు వస్తాయి. మొటిమల సమస్యలు మొదలవుతాయి. ఉప్పు మన శరీరంలో ఉన్న నీటిని స్టోర్‌ చేసుకుంటుంది కాబట్టి శరీర కణాలలో నీటి కొరత ఏర్పడుతుంది. ఆ కారణంగా మొహం ఉబ్బుతుంది. మితంగా తీసుకునే ఉప్పు మన చర్మం నిగనిగలా ఉండటానికి దోహదపడుతుంది. ఎక్కువ ఉప్పు తీసుకోవడం మొదలుపెడితే వెంటనే చర్మం తేమను కోల్పోతుంది. ఆ కారణంగా చర్మం పొడిగా, నిర్జీవంగా మారుతుంది. చిన్నవయసులోనే ముడతలు వచ్చేస్తాయి. ఇంకాస్త ఉప్పు ఎక్కువ తీసుకుంటే చర్మం ఎరుపెక్కుతుంది. మంట, దురద వంటి సమస్యులు కూడా వస్తాయి. మనలో ఇమ్యూనిటీ శక్తి తగ్గిపోతుంది. శరీరంలో ఏర్పడే గాయాలు అంత త్వరగా మానవు. అంచేత ఉప్పును తక్కువగా తీసుకోండి.. ఆరోగ్యంగా ఉండండి.

Eha Tv

Eha Tv

Next Story