మనకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు లేదా బంధువులు, కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ బాధ వర్ణానాతీతం.

మనకు చాలా దగ్గరగా ఉండే వ్యక్తులు లేదా బంధువులు, కుటుంబసభ్యుల్లో ఎవరైనా చనిపోతే ఆ బాధ వర్ణానాతీతం. వారితో మనకు ఉన్న అనుబంధాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ బాధపడుతుంటాం. వారి జ్ఞాపకాలను నెమరువేసుకుంటుంటాం. అయితే వారు పదే పదే మన కలలోకి(Dreams) కూడా రావడం పట్ల అనేక కారణాలున్నాయంటున్నారు పలువురు పండితులు. ఎప్పుడో ఒక సారి ఆ వ్యక్తి కలలోకి వస్తుంటే ఓకే కానీ.. ప్రతి సారీ వస్తుంటే మాత్రం సీరియస్‌గా తీసుకోవాలని చెప్తున్నారు. వారి ఆత్మ ఇంకా(Soul) మన పరిసరాల్లోనే తిరుగుతుందని చెప్తారు. చనిపోయినవారి పేరుతో రామాయణం, భాగవతం వంటి పురాణాలు చదవాలని పండితులు చెప్తున్నారు. మరణించిన వ్యక్తి తరుచుగా కలలో కనపడితే శాంతి చేయించాలని సూచిస్తున్నారు. ఏమీ మాట్లాడకుండా అలా కలలోకి వచ్చి వెళ్తే అన్నదానం నిర్వహించాలని దాని అర్థమట. మరణించిన వ్యక్తి చాలా కోపంగా కలలో కనిపిస్తే వారు మన నుంచి ఏదో ఆశిస్తున్నారట. అతను లేదా ఆమె పేరుతో ఏదైనా దాన, ధర్మాలు చేస్తే కానీ ఆత్మ శాంతించదంటున్నారు. వారు చాలా సంతోషంగా కలలో కనపడితే మాత్రం ఏమీ ఆశించడంలేదని అర్థం. అయితే తరుచుగా వారు కలలోకి వస్తే మాత్రం వారు అనుకున్న కార్యక్రమాలు చేస్తే ఆత్మశాంతించి తిరిగిరాని లోకాలకు వెళ్లిపోతుందని అంటున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story