పల్లీలంటే(Ground Nut) ఇష్టం లేని వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అత్యధిక ప్రోటీన్‌లు వేరుశనగలో ఉండటం ఓ కారణం కావచ్చు.

పల్లీలంటే(Ground Nut) ఇష్టం లేని వారిని వేళ్లమీద లెక్కపెట్టవచ్చు. అత్యధిక ప్రోటీన్‌లు వేరుశనగలో ఉండటం ఓ కారణం కావచ్చు. పల్లీలను పచ్చివి తింటారు కొందరు. మరికొందరు వేయించుకుని తింటారు. ఇంకొందరు ఉడకపెట్టుకుని తింటారు. ఎలా తిన్నా మంచిదే. డ్రై ఫూట్స్‌లో(Dry fruits) ఉండే పోషకాలన్నీ వీటిల్లో ఉంటాయి. పైగా ధర కూడా తక్కువే! మాంసాహారంలో ఎన్ని పోషకాలు ఉంటాయో పల్లీలో కూడా అన్ని పోషకాలు ఉంటాయన్నది పరిశోధనల్లో వెల్లడైన సత్యం. పల్లీలంటే మొహం అదోలా పెట్టేవారు వాటి వల్ల కలిగే లాభాలను తెలుసుకుంటే ఇక మళ్లీ వాటిని వదలరు. పల్లీలలో ఎన్నో రకాల ఔషధ గుణాలు ఉన్నాయి. సెలీనియం, పొటాషియం, ఐరన్‌, కాల్షియం, రిబోఫ్లావిన్‌, విటమిన్‌ బ6, థయామిన్‌, జింక్‌, కాపర్‌, మాంగనీస్‌ .. అబ్బో ఇంకా చాలా పోషకాలు ఉన్నాయి. పల్లీలలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ గుండె సమస్యలు రాకుండా చేస్తుంది. బాదం, జీడిపప్పుతో పాటు వేరుశెనగ కూడా తీసుకుంటే శరీరానికి తగినంత బలం వస్తుంది. వేరుశనగ తీసుకోవడం వల్ల మానసిక సమస్యలు దూరమవుతాయట! అంతేనా కిడ్నీలో రాళ్లు కూడా తొలగిపోతాయట! పల్లీలలో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ పెద్దపేగు కేన్సర్‌ను నిరోధిస్తుది. యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

Updated On
Eha Tv

Eha Tv

Next Story