✕
ఉదయం మేల్కొన్న తరువాత కళ్లు తెరవగానే ముందుగా ఏం చూడాలి ? ఏం చూడకూడదు ? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఉదయం నిద్ర లేవగానే మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు పరమేశ్వరుడు. మన అరచేతిని మనం చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ దేవత ప్రసన్నం కలుగుతుంది. ఆ తరువాత మనం భూమి మీద కాలు పెట్టగానే భూదేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది కనుక ముందుగా ఆమెకు నమస్కరించి భూమి […]

x
what we see in wake up time
ఉదయం మేల్కొన్న తరువాత కళ్లు తెరవగానే ముందుగా ఏం చూడాలి ? ఏం చూడకూడదు ? అనే ప్రశ్న అందరిలోనూ తలెత్తుతుంది. ఉదయం నిద్ర లేవగానే మన చేతిలోనే లక్ష్మీదేవిని పెట్టాడు పరమేశ్వరుడు. మన అరచేతిని మనం చూసుకున్నట్టయితే మనకు లక్ష్మీ దేవత ప్రసన్నం కలుగుతుంది. ఆ తరువాత మనం భూమి మీద కాలు పెట్టగానే భూదేవతకు నమస్కారం చేయాలి. ఎందుకంటే మనం చేసే పాపాలను ఆ తల్లి భరిస్తుంది కనుక ముందుగా ఆమెకు నమస్కరించి భూమి మీద కాలు పెట్టాలి. ఈ విధంగా పెట్టి ప్రతీ రోజు మన దినచర్యను ప్రారంబిస్తే మంచి ఫలితాలను పొందవచ్చు. ఉదయం నిద్ర లేవగానే చూడాల్సిన వాటిని పరిశీలిస్తే... బంగారం, సూర్యుడు, ఎర్రచందనము, సముద్రము, గోపురం, పర్వతము, దూడతో ఉన్న ఆవు, కుడి చేయి, తన భార్యని చూడటం మంచిది. తల్లిని లేదా తండ్రిని కూడా చూడొచ్చు. భార్యనూ చూడొచ్చు. ఇష్టదైవం పటం చూడటం శుభప్రదం. ఇక నిద్రలేవగానే చూడకూడని విషయాలు పరిశీలిస్తే..... మురికిగా, విరిగిపోయిన వస్తువులు చూడవద్దు. విరబోసుకుని ఉన్న భార్యను కూడా చూడొద్దు. బొట్టులేని ఆడపిల్ల, క్రూరజంతువులు లేదా వాటి ఫోటోలు చూడకూడదు.

Ehatv
Next Story