కనుమరుగయ్యిందని అనుకున్న కరోనా వైరస్ మళ్లీ విరుచుకుపడుతోంది. వేగంగా విస్తరిస్తోంది. అందరిలోనూ భయాందోళనలను రేపుతోంది. దేశ వ్యాప్తంగా పెరుగుతున్న పాజిటివ్ కేసులు టెన్షన్ పెడుతున్నాయి. అనూహ్యంగా పాజిటివ్ కేసుల సంఖ్య ఆరువేలు దాటడంతో అధికారులు అలెర్టయ్యారు. కేంద్రప్రభుత్వం కూడా అప్రమత్తమయ్యింది.

దేశంలో కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 లేదా ఆర్ట్కురుస్ శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ఫలితంగా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొత్త వేరియంట్ ఎంత మేరకు ప్రమాదకారి అన్నదానిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ పరిశోధనలు చేస్తోంది. ముఖ్యంగా ఈ వేరియంట్ పిల్లలపై పెను ప్రభావం చూపుతోంది. ఈ వైరస్ సోకిన చిన్నారులలో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. తాజాగా కోవిడ్ బారిన పడుతున్న చిన్నారులలో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు కరోనా సోకిన వారిలో ఇలాంటి లక్షణాలు కనిపించలేదు. ఇప్పుడీ కొత్త లక్షణాలతో పాటు ఇంతకు ముందులా హైఫీవర్, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లు నొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కూడా పిల్లల్లో కనిపిస్తున్నాయి.