ప‌హ‌ల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌(Pakistan) లోని ఉగ్రస్థావ‌రాలే ల‌క్ష్యంగా భార‌త సైన్యం మంగ‌ళ‌వారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడుల‌కు పాల్పడిన సంగ‌తి తెలిసిందే.

ప‌హ‌ల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్థాన్‌(Pakistan) లోని ఉగ్రస్థావ‌రాలే ల‌క్ష్యంగా భార‌త సైన్యం మంగ‌ళ‌వారం అర్ధరాత్రి తర్వాత మెరుపు దాడుల‌కు పాల్పడిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో నియంత్రణ రేఖ వ‌ద్ద పాకిస్థాన్‌ కాల్పుల విర‌మ‌ణ ఒప్పందాన్ని మరోసారి ఉల్లంఘించింది. సరిహద్దు వెంబడి విచ‌క్షణార‌హితంగా కాల్పులు జ‌రిపింది. ఈ కాల్పుల్లో పది మంది భార‌త ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. అమాయ‌క ప్రజ‌ల‌ను పాక్ బ‌లిగొంద‌ని భార‌త సైన్యం తెలిపింది. పలువురు గాయపడినట్లు వెల్లడించింది. దీనికి బ‌దులు తీర్చుకుంటామ‌ని భారత సైన్యం హెచ్చరించింది.

ehatv

ehatv

Next Story