అమెరికాలో(America) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దంపతులు(Couple) గొడవ పడుతూ..

అమెరికాలో(America) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఓ ఇంట్లో దంపతులు(Couple) గొడవ పడుతూ.. పరస్పరం దాడి చేసుకొని ప్రాణాలు కోల్పోగా(Death).. పక్క గదిలో వీడియో గేమ్‌(Video Games) ఆడుతున్న వారి 11 ఏళ్ల కుమారుడు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడం గమనార్హం. హాలోవీన్‌ వేడుకల(Halloween celebrations) సందర్భంగా గత నెల 31వ తేదీన వాషింగ్టన్‌లోని(Washinggtan) లాంగ్‌వ్యూలో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. చివరకు రక్తపు మడుగులో ఉన్న తల్లిదండ్రులను చూసిన బాలుడు 911కి ఎమర్జెన్సీ కాల్‌ చేసి విషయాన్ని పోలీసులకు చెప్పినట్లు తెలిపింది. ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాల సమీపంలో కత్తితో పాటు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story