బంగ్లాదేశ్‌లోని ఝలకతి సదర్ ఉపజిల్లాలో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఛత్రకాండ ప్రాంతంలో శనివారం రోడ్డు పక్కన ఉన్న చెరువులో బస్సు పడిపోవడంతో 17 మంది మరణించారు.

బంగ్లాదేశ్‌(Bangladesh)లోని ఝలకతి సదర్ ఉపజిల్లా(Jhalakathi Sadar upazila)లో ఘోర ప్ర‌మాదం జ‌రిగింది. ఛత్రకాండ(Chhatrakanda) ప్రాంతంలో శనివారం రోడ్డు పక్కన ఉన్న చెరువు(Pond)లో బస్సు(Bus) పడిపోవడంతో 17 మంది మరణించారు. భండారియా ఉపజిల్లా(Bhandaria upazila) నుండి పిరోజ్‌పూర్‌(Pirojpur) బరిశాల్(Barishal) వెళ్తున్న బస్సు.. స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఉదయం 9.55 గంటలకు ఆటో రిక్షా(Auto Rikshaw)కు సైడ్ ఇస్తుండగా.. డ్రైవర్(Driver) బ‌స్సుపై నియంత్రణ కోల్పోవడంతో చెరువులో పడిపోయిందని ఝలకతి సదర్ పోలీస్ స్టేషన్ ఇన్‌చార్జ్ అధికారి నసీర్ ఉద్దీన్(Nasir Uddin) తెలిపారు.

ఈ ప్రమాదంలో 35 మంది ప్రయాణికులు గాయపడగా.. వారిని ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్ర‌మాద స‌మ‌యంలో బస్సులో 60-70 మంది ప్రయాణికులు ఉన్నట్లు స్థానికులు తెలిపారు. జిల్లా సివిల్ సర్జన్ డాక్టర్ జహీరుల్ ఇస్లాం(Zahirul Islam) ప్రకారం.. రెస్క్యూ కార్మికులు సంఘటనా స్థలం నుండి 13 మృతదేహాలను వెలికితీయ‌గా.. మరో నలుగురు ఆసుపత్రిలో మరణించారు. గాయపడిన వారిలో ఐదుగురిని బరిషల్‌లోని షేర్-ఎ-బంగ్లా మెడికల్ కాలేజీ ఆసుపత్రి(Sher-e-Bangla Medical College Hospital)కి తరలించినట్లు ఆయన తెలిపారు. మిగిలిన వారిని స్థానిక ఆరోగ్య కేంద్రాల్లో చేర్చారు.

Updated On 22 July 2023 9:13 PM GMT
Yagnik

Yagnik

Next Story