యునైటెడ్ స్టేట్స్‌లోని బాల్టిమోర్‌లో ఆదివారం జరిగిన ఒక పార్టీలో సాయుధుడు కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. ఈఘ‌ట‌న‌లో మ‌రో 25 మంది గాయపడ్డారు. బాల్టిమోర్‌లోని బ్రూక్లిన్ పరిసరాల్లో ఒక పార్టీలో కాల్పులు జరిగినట్లు బీఎన్ఓ నివేదిక పేర్కొంది. 100 మందికి పైగా ప్రజలు హాజరైన ఒక‌ పార్టీలో ఓ గుర్తు తెలియని సాయుధుడు 30 రౌండ్లు కాల్పులు జరప‌గా.. నలుగురు మరణించారు..

యునైటెడ్ స్టేట్స్‌లోని బాల్టిమోర్‌లో ఆదివారం జరిగిన ఒక పార్టీలో సాయుధుడు కాల్పులు జరపడంతో నలుగురు మరణించారు. ఈఘ‌ట‌న‌లో మ‌రో 25 మంది గాయపడ్డారు. బాల్టిమోర్‌లోని బ్రూక్లిన్ పరిసరాల్లో ఒక పార్టీలో కాల్పులు జరిగినట్లు బీఎన్ఓ నివేదిక పేర్కొంది. 100 మందికి పైగా ప్రజలు హాజరైన ఒక‌ పార్టీలో ఓ గుర్తు తెలియని సాయుధుడు 30 రౌండ్లు కాల్పులు జరప‌గా.. నలుగురు మరణించారు.. మ‌రో 25 మంది గాయ‌ప‌డ్డారని స్థానిక మీడియా నివేదిక‌లు వెల్ల‌డించాయి. "బ్రూక్లిన్ డే" అనే వార్షిక వేడుకకు హాజ‌ర‌య్యేందుకు జ‌నాలు అక్క‌డికి వ‌చ్చిన‌ట్లు నివేదిక వెల్ల‌డించింది. బాల్టిమోర్ పోలీస్ డిపార్ట్‌మెంట్ అధికారులు ప్రస్తుతం సామూహిక కాల్పులు జ‌రిగిన‌ స్థలంలో ఉన్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Updated On 2 July 2023 5:35 AM GMT
Ehatv

Ehatv

Next Story