200 ఏళ్ల నాటి కండోమ్ గురించి వార్తలు హాట్ టాపిక్‌గా నడుస్తున్నాయి. ఈ కండోమ్ నెదర్లాండ్స్‌లోని రైక్స్‌మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడింది, శృంగార బొమ్మలు, చరిత్ర అందరినీ ఆకర్షిస్తోంది.

200 ఏళ్ల నాటి కండోమ్ గురించి వార్తలు హాట్ టాపిక్‌గా నడుస్తున్నాయి. ఈ కండోమ్ నెదర్లాండ్స్‌లోని రైక్స్‌మ్యూజియంలో ప్రదర్శనకు ఉంచబడింది, శృంగార బొమ్మలు, చరిత్ర అందరినీ ఆకర్షిస్తోంది. అయితే ఇది గొర్రె పేగు నుంచి తయారు చేసినట్లు భావిస్తున్నారు.

ఈ కండోమ్ సుమారు 1830 సంవత్సరంలో గొర్రె అపెండిక్స్ లేదా పేగు)నుంచి తయారు చేసినట్లు భావిస్తున్నారు. వల్కనైజ్డ్ రబ్బర్ కనిపెట్టబడక ముందు జంతు పేగులతో తయారు చేసిన కండోమ్‌లు ఆసమయంలో సాధారణంగా ఉపయోగించబడేవి. ఈ కండోమ్ రైక్స్‌మ్యూజియంలో "సేఫ్ సెక్స్?" అనే ఎగ్జిబిషన్‌లో భాగంగా జూన్‌లో ప్రదర్శనకు ఉంచారు. ఇది గాజు కేస్‌లో ఉంచబడి, 19వ శతాబ్దంలో సెక్స్, ఆరోగ్యం, వ్యభిచారం గురించి అవగాహన కల్పించే కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనకు ఉంచారు. ఈ కండోమ్ 20 సెం.మీ. పొడవు ఉంది, అప్పటి సాధారణ కండోమ్‌ల 15 సెం.మీ. కంటే పెద్దది. UV లైట్‌తో పరీక్షించగా, ఇది ఉపయోగించబడలేదని తేలింది. ఈ కండోమ్‌ను హార్లెమ్‌లో జరిగిన ఒక వేలంలో 1,000 డాలర్లు అంటే సుమారు రూ.90,000 వేలకు కొనుగోలు చేశారు. ఇది ప్రపంచంలో రెండు మాత్రమే మిగిలిన ఇలాంటి కండోమ్‌లలో ఒకటిగా భావిస్తున్నారు.

దానిని అతినీలలోహిత కాంతి కింద పరిశీలించగా, దానిని ఎప్పుడూ ఉపయోగించలేదని తేలిందని మ్యూజియం క్యూరేటర్ జాయిస్ జెలెన్ చెప్పారు. 'ప్రింటెడ్ కండోమ్ ఉన్న ఏకైక ఆర్ట్ మ్యూజియం మా వద్ద ఉందని చెప్పుకోవడానికి మేం గర్విస్తున్నాం. దీనిని ఇతర మ్యూజియంలకు అప్పుగా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఈ కండోమ్ చాలా పెళుసుగా ఉంటుంది. ఇది నవంబర్ చివరి వరకు మాత్రమే ప్రదర్శనలో ఉంటుంది.'అని జెలెన్ అన్నారు. ఈ కండోమ్ గురించి మరో ప్రత్యేకత ఏమిటంటే దానిపై ఒక చిత్రం ముద్రించి ఉంది. ఇందులో ముగ్గురు అర్ధనగ్నంగా నిలబడి ఉన్నారు. ఈ కండోమ్‌పై చిత్రం గ్రీకు పురాణం నుండి ప్రేరణ పొందిందని అంటున్నారు. ఇందులో ట్రోజన్ రాకుమారుడు ముగ్గురు అందమైన అమ్మాయిలలో ఒకరిని ఎంచుకుంటాడని చెబుతున్నారు. 19 వ శతాబ్దంలో కండోమ్‌లను చాలా చెడ్డవిగా భావించేవారు. అందుకే కొందరు వీటిని రహస్యంగా ఉపయోగించారు. అప్పట్లో కొన్ని నగరాల్లో వ్యభిచారం జోరుగా సాగేదని.. ఇలాంటి పరిస్థితుల్లో ఈ కండోమ్‌ను కస్టమర్లు వినియోగించేవారని అభిప్రాయపడ్డారు. ఈ కళాఖండాన్ని ప్రదర్శనలో ఉంచినప్పటి నుంచి చిన్నా పెద్ద తేడాలేకుండా మ్యూజియానికి క్యూ కడుతున్నారని అధికారులు తెలిపారు. 2025 నవంబర్ చివరి వారం వరకు ఈ కండోమ్ ప్రదర్శనలో ఉంటుందన్నారు.

Updated On 9 Jun 2025 2:30 PM GMT
ehatv

ehatv

Next Story