ఇదో చిత్రమైన పెళ్లి(Wierd Marriage). విచిత్రం కాబట్టే సోషల్ మీడియా(Social media) లో చక్కర్లు కొడుతుంది.

ఇదో చిత్రమైన పెళ్లి(Wierd Marriage). విచిత్రం కాబట్టే సోషల్ మీడియా(Social media) లో చక్కర్లు కొడుతుంది. మెజారిటీ మనుషులు పెళ్లిళ్లు చేసుకుంటారు. తోడు కోసం పరితపిస్తూ ఉంటారు. కానీ ఈ పెళ్లి మాత్రం చాలా చాలా ప్రత్యేకం. పెళ్లి కొడుకు వయసు 23 ఏళ్లు. పెళ్లి కూతురు వయసు మాత్రం 91 ఏళ్ళు అయితే చిత్రమే కదా! ఇద్దరి మధ్య 68 ఏళ్ల గ్యాప్‌. అంతేనా, హనీమూన్‌ ట్రిప్‌లో(Honeymoon) పెళ్లి కుమార్తె చనిపోయింది(Bride death). అసలు హనీమూన్ లో ఏం జరిగింది? డిటైల్స్ లోకి వెళితే, అర్జెంటీనాలో(Urgentina) ఓ 23 ఏళ్ల యువకుడు తన తల్లి, సోదరుడితో కలిసి ఉంటున్నాడు. ఓ 91 ఏళ్ల ఒంటరి వృద్ధురాలు కూడా వారితోపాటే ఉంటోంది. అప్పటికే ఆ యువకుడి తండ్రి చనిపోయాడు. పేదరికం కావడంతో ఆ యువకుడు చదువు ఖర్చులకు కూడా డబ్బులు లేక అవస్థలు పడేవాడు. ఆ క్రమంలో ఒంటరి వృద్ధురాలు అతడికి ఒక ఆఫర్‌ చేసింది. తనను పెళ్లి చేసుకుంటే చదువుతోపాటు, ఇంటి ఖర్చులు తానే చూసుకుంటానంది.

తనను పెళ్లి చేసుకుంటే తన సంపదతోపాటు, తన తదనంతరం ఒక భర్తగా తన పెన్షన్‌ కూడా నీకే వస్తుందని యువకుడితో తెలిపింది. వృద్ధురాలి ఆఫర్‌కు యువకుడితోపాటు అతడి తల్లి, సోదరుడు కూడా ఓకే చెప్పారు. వారికి పెళ్లి చేశారు. వివాహం తర్వాత కొత్త జంట హనీమూన్‌కు వెళ్ళింది. ఈ హనీమూన్‌ సమయంలోనే పెళ్లి కూతురు బెడ్‌పైనే ప్రాణాలు కోల్పోయింది. దాంతో యువకుడు ఆమెను ఇంటికి తీసుకొచ్చి అంతిమ సంస్కారాలు చేశాడు.

ఆ తర్వాత భార్య పెన్షన్‌ కోసం ఆ యువకుడు అప్లై చేశాడు. అధికారులకు అనుమానం కలిగింది. యువకుడే ఆమెను హత్యచేసి ఉంటాడని భావించారు. అతడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు యువకుడిపై కేసు నమోదు చేసి జైలుకు తరలించే ప్రయత్నం చేశారు. అయితే ఆ యువకుడు న్యాయ పోరాటం చేసి తాను హంతకుడిని కాదని నిరూపించుకున్నాడు. ఆమెది సహజ మరణమేనని రుజువు చేశాడు. ఇంతా చేస్తే మృతురాలి పెన్షన్‌ డబ్బులు ఇచ్చేందుకు మాత్రం అధికారులు ఒప్పుకోవడం లేదు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story