రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రభుత్వ అధికారులు కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా పాస్‌పోర్టును తీసుకెళ్లాలి. అక్రమ వలసదారులను నిరోధించేందుకు 1920 నుంచి పాస్‌పోర్ట్ విధానం అమలులోకి వచ్చింది. పాస్‌పోర్ట్ లాంటి వ్యవస్థను మొదటిసారిగా అమలులోకి అమెరికా తీసుకొచ్చింది.

రాష్ట్రపతి నుంచి ప్రధానమంత్రి వరకు ప్రభుత్వ అధికారులు కూడా ఒక దేశం నుంచి మరో దేశానికి వెళ్లాలనుకుంటే తప్పనిసరిగా పాస్‌పోర్టును తీసుకెళ్లాలి. అక్రమ వలసదారులను నిరోధించేందుకు 1920 నుంచి పాస్‌పోర్ట్ విధానం అమలులోకి వచ్చింది. పాస్‌పోర్ట్ లాంటి వ్యవస్థను మొదటిసారిగా అమలులోకి అమెరికా తీసుకొచ్చింది. విదేశాలకు వెళ్లే వ్యక్తికి పాస్‌పోర్ట్ గుర్తింపు కార్డుగా ఉంటుంది. పాస్‌పోర్ట్‌లో ప్రయాణికుడి వివరాలు పొందుపరుస్తారు.

కానీ ప్రపంచంలో ముగ్గురికి మాత్రం ఇవేవీ అక్కర్లేదు. వీరు ప్రపంచంలోని ఏ దేశానికి వెళ్లాలన్న పాస్‌పోర్టు అవసరం లేదు. అందులో ఒకరు
బ్రిటన్ రాజు. రెండో వ్యక్తి జపాన్ రాజు, జపాన్‌ రాణి పాస్‌పోర్ట్ లేకుండా ప్రయాణించే అవకాశం ఉంది. చార్లెస్ బ్రిటన్ రాజు కావడానికి ముందు క్వీన్ ఎలిజబెత్‌కు ఈ ప్రత్యేక హక్కు ఉంది. చార్లెస్ బ్రిటన్ రాజుగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత, అతని కార్యదర్శులు తమ దేశ విదేశాంగ కార్యాలయం ద్వారా అన్ని దేశాలకు విదేశీ ప్రయాణాలకు అవసరమైన పత్రాలను పంపారు. కింగ్ చార్లెస్ ఇప్పుడు బ్రిటిష్ రాజకుటుంబానికి అధిపతిగా ఉన్నందున అన్ని దేశాలకు అనుమతించబడాలని.. రాజుల ప్రయాణానికి ఎలాంటి ఆటంకం కలగకూడదని ప్రపంచదేశాలకు పత్రాలు పంపించారు. బ్రిటిష్ రాజులకు మాత్రమే ఈ ప్రత్యేక అవకాశం ఉంది. కానీ అతని భార్యకు ఈ అవకాశం లేదు. రాజు భార్యకు కాన్సులర్ పాస్‌పోర్ట్‌ ఇస్తారు. కాన్సులర్ పాస్‌పోర్ట్ హోల్డర్లకు తనిఖీల నుంచి మినహాయింపు ఉండడమే కాకుండా ప్రత్యేక గౌరవం లభిస్తుంది.

జపాన్ రాజు, రాణి కూడా ఈ ప్రత్యేక సదుపాయాన్ని కలిగి ఉంటారు. ప్రస్తుత జపాన్ రాజు నరుహిటో, ఆయన భార్య మసాకో ఒవాటా పాస్‌పోర్ట్ లేకుండా ప్రపంచ దేశాలకు ప్రయాణించవచ్చు. ఈ ముగ్గురూ విదేశాలకు వెళితే జపాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ, బ్రిటన్‌లోని కింగ్స్ సెక్రటేరియట్ వారివారి ప్రయాణాలకు సంబంధించిన సమాచారాన్ని ముందుగానే ఆయా దేశాలకు పంపిస్తాయి.

దేశాల ప్రధానమంత్రులు, అధ్యక్షులు విదేశాలకు ప్రయాణిస్తే కాన్సులర్ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉంటారు. కాన్సులర్ పాస్‌పోర్ట్‌లను కలిగి ఉన్న నాయకులకు భద్రతా తనిఖీల నుంచి మినహాయింపు ఉంటుంది. ప్రత్యేక గౌరవం ఉంటుంది. మన దేశంలో కాన్సులర్‌ పాస్‌పోర్టులను ప్రధాని, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి మాత్రమే కలిగి ఉంటారు.

Updated On 23 Jan 2024 6:46 AM GMT
Ehatv

Ehatv

Next Story