పశ్చిమ ఆఫ్రికాలోని(South africa) సెనెగల్‌లో(senegal) గగుర్పాటు కలిగించే భయానక దృశ్యం కనిపించింది

పశ్చిమ ఆఫ్రికాలోని(South africa) సెనెగల్‌లో(senegal) గగుర్పాటు కలిగించే భయానక దృశ్యం కనిపించింది. సెనెగల్‌ సముద్ర(sea costal) తీరంలో ఉన్న ఓ పడవలో(Boat) కుళ్లిపోయిన(Decomposed) స్థితిలో ఉన్న 30 మృతదేహాలు(dead bodies) కనిపించాయి. సెనెగల్‌ రాజధాని డాకర్‌కు(Dakar ) 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ చెక్క పడవను నేవీ సిబ్బంది ఓడరేవుకు చేర్చారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోవడంతో వాటిని గుర్తించలేకపోతున్నామని స్థానిక అధికారులు అంటున్నారు. ఎవరివనేది గుర్తించడానికి అన్ని మార్గాలను అన్వేషిస్తున్నామని చెప్పారు. సెనెగల్‌లో నిరుద్యోగం పెరిగిపోయింది. పేదరికంతో ప్రజలు అల్లాడిపోతున్నారు. వీటికి తోడు అంతర్యుద్ధాలు.. వీటితో విసిగిపోయిన యువకులు సెనెగల్‌ నుంచి స్పెయిన్‌ కానరీ దీవులకు వలస వెళుతున్నారు. అట్లాంటిక్‌ మహా సముద్రం మీదుగా 1500 కిలోమీటర్లకు పైగా ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ప్రయాణిస్తున్నారు. బహుశా ఈ మృతదేహాలు సెనెగల్‌ వలసదారులవే అయి ఉంటాయని అధికారులు అనుకుంటున్నారు. చాలా రోజులుగా అట్లాంటిక్ మహాసముద్రంలో ఈ పడవ ఉండి వుంటుందని, ఆకలి దప్పులతో వారు చనిపోయి ఉంటారని అధికారులు చెబుతున్నారు. ఆగస్ట్‌ నెలలో కూడా డొమినికన్ రిపబ్లిక్ తీరంలో ఒక పడవలో 14 మృతదేహాలు లభ్యం అయ్యాయి. అవి సెనెగల్ జాతీయులవై ఉంటాయని మత్స్యకారులు చెబుతున్నారు. కాగా అక్రమ వలసలను అరికట్టడానికి సెనెగల్ 10 సంవత్సరాల ప్రణాళికను ప్రకటించింది కాని వలసలు మాత్రం ఆగడం లేదు.

Updated On
Eha Tv

Eha Tv

Next Story