చాలా దేశాలలో అందాల పోటీలు జరగుతుంటాయి. మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌(Miss Universe) పోటీలు కాసింత భిన్నం. ప్రతి ఏడాది జరిగే ఈ పోటీల కోసం ఎంతో మంది యువతులు ప్రిపేర్‌ అవుతుంటారు. ఇందులో గెలవాలంటే అందం ఒక్కటే సరిపోదు, ఫిట్‌నెస్‌, మోడలింగ్‌తో పాటు అవగాహన కూడా ముఖ్యం. అందాల పోటీలంటే మనకు యువతులే గుర్తుకు వస్తారు.

చాలా దేశాలలో అందాల పోటీలు జరగుతుంటాయి. మిస్‌ వరల్డ్‌, మిస్‌ యూనివర్స్‌(Miss Universe) పోటీలు కాసింత భిన్నం. ప్రతి ఏడాది జరిగే ఈ పోటీల కోసం ఎంతో మంది యువతులు ప్రిపేర్‌ అవుతుంటారు. ఇందులో గెలవాలంటే అందం ఒక్కటే సరిపోదు, ఫిట్‌నెస్‌, మోడలింగ్‌తో పాటు అవగాహన కూడా ముఖ్యం. అందాల పోటీలంటే మనకు యువతులే గుర్తుకు వస్తారు. కానీ అందాల కిరీటాన్ని ధరించడానికి వయసు అడ్డు కాదని నిరూపించారో మహిళ. 60 ఏళ్ల వయసులో పడుచు అమ్మాయిలతో పోటీ పడి మరీ విజేతగా నిలిచారు. అర్జెంటీనాకు(Argentina) చెందిన 60 ఏళ్ల అలెజాండ్రా మరీసా రొడ్రిగోజ్‌(Alejandra Marisa Rodriguez) వృత్తి రీత్యా న్యాయవాది, జర్నలిస్ట్ కూడా! ఇటీవల బ్యూనస్ ఎయిర్స్‌ ప్రావిన్స్‌లో అందాల పోటీలు జరిగాయి. బ్యూనస్‌ ఎయిర్స్‌ ప్రావిన్స్‌ రాజధాని లా ప్లాటాకు చెందిన అలెజాండ్రా కూడా పాల్గొన్నారు. పాల్గొనడమే కాదు విజేతగా నిలిచారు. ఆరు పదుల వయసులో అందాల కిరీటం పొందిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. అందానికి సరికొత్త నిర్వచనం ఇచ్చారామె! ఈ అందాల మహిళ ఫోటోలు, వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. వచ్చే నెలలో జరగబోయే మిస్‌ యూనివర్స్‌ అర్జెంటీనా పోటీలలో ఈమె బ్యూనస్‌ ఎయిర్స్‌ తరఫున పాల్గొనబోతున్నారు. ఇందులో గెలిస్తే సెప్టెంబర్‌లో మెక్సికోలో జరిగే విశ్వసుందరి (మిస్‌ యూనివర్స్‌)పోటీలలో అర్జెంటీనా తరఫున పాల్గొంటారు. ఫలానా వయసువారే అందాల పోటీలలో పాల్గొనాలనే నియమమేమీ లేదు. వయోపరిమితిని తొలగిస్తూ లాస్టియర్‌ మిస్‌ యూనివర్స్‌ ఆర్గనైజేషన్ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు 18 ఏళ్ల నుంచి 28 ఏళ్ల వయసున్న మహిళలే ఇందులో పాల్గొనే వీలుండేది. ఇప్పుడు 18 ఏళ్లు పైబడిన మహిళలందరూ పాల్గొనవచ్చు.

Updated On 27 April 2024 5:14 AM GMT
Ehatv

Ehatv

Next Story