పండు ముసలినెవరినైనా పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే ఈ వయసులో నాకెవరు పిల్లనిస్తారని అంటారే తప్ప ఈ వయసులో పెళ్లేమిటని చస్తే అనరు. అలాంటి మగానుభావులు చాలా మందే ఉంటారు. ఈ లిస్టులో అమెరికా(America)లోని టెక్సాస్‌(Texas)కు చెందిన గిల్బర్ట్‌(Gilbert)ను కూడా చేర్చవచ్చు. ఈయనకు ఏడు పదుల వయసుంటుంది.

పండు ముసలినెవరినైనా పెళ్లి చేసుకుంటావా? అని అడిగితే ఈ వయసులో నాకెవరు పిల్లనిస్తారని అంటారే తప్ప ఈ వయసులో పెళ్లేమిటని చస్తే అనరు. అలాంటి మగానుభావులు చాలా మందే ఉంటారు. ఈ లిస్టులో అమెరికా(America)లోని టెక్సాస్‌(Texas)కు చెందిన గిల్బర్ట్‌(Gilbert)ను కూడా చేర్చవచ్చు. ఈయనకు ఏడు పదుల వయసుంటుంది. ఈ వయసులో తనకు తగిన భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నాడు. 2015 నుంచి తాను ఒంటరిగా ఉంటున్నానని, అందుకే తనకు తగిన భాగస్వామి కోసం ఆశగా ఎదురుచూస్తున్నానని అంటున్నాడు. ఈమధ్యనే తాను రిటైర్‌ అయ్యానని, ఆదాయం కూడా బాగానే ఉందని చెబుతున్నారు. డబ్బుంది కాబట్టే తనకు తగిన గర్ల్‌ ఫ్రెండ్‌ కావాలంటూ బిల్‌ బోర్డులపై ప్రకటనలు కూడా ఇస్తున్నాడు. వీటి కోసమే వారానికి సుమారు 33 వేల రూపాయలు ఖర్చు చేస్తున్నాడు గిల్బర్ట్‌. ఈ ప్రకటనలతో ఆయనకు సుమారు నాలుగువందలకు పైగా కాల్స్‌, ఇ-మెయిల్స్‌ వచ్చాయట! వారంతా తాను డబ్బున్నవాడిగా భావించి పెళ్లి చేసుకోవడానికి రెడీ అయ్యారే తప్ప వారిలో నిజాయితీ లేదని చెప్పాడు. అందుకే మంచి అమ్మాయి కోసం యూకే వరకు వెళ్లివస్తానని అంటున్నాడు. తనకు నమ్మకమైన భాగస్వామి కోస ఎంత దూరమైన వెళతానని, ఎన్ని రోజులైనా ఎదురు చూస్తానని చెబుతున్నాడీ 70 ఏళ్ల యువకుడు. నచ్చిన అమ్మాయి దొరికేంత వరకు బిల్‌బోర్డులో ప్రకటనలు ఇస్తూనే ఉంటానని, ఎంత డబ్బైనా ఖర్చు చేస్తానని చెబుతున్న గిల్బర్ట్‌ తన వయసు కంటే తక్కువ వయసు అమ్మాయి అయినా ఫర్వాలేదంటున్నాడు.

Updated On 1 May 2024 6:04 AM GMT
Ehatv

Ehatv

Next Story